ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు పెద్దలు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ అనే రాజకీయపార్టీ చివరకు తెలంగాణ అనే పేరును తొలగించడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పొంగులేటి, జూపల్లి పెట్టబోయే కొత్త పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిజిస్టర్ కూడా జరిగినట్లు సమాచారం.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అంకురార్పణ జరగనుందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. కేసీఆర్ తో విభేధించిన వ్యక్తులను, పార్టీలను బతికి బట్ట కట్టనిచ్చే పరిస్థితి లేదని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. బిఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన టైగర్ నరేంద్రను, తల్లి తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ పొంగులేటి, జూపల్లి పెట్టే కొత్త రాజకీయ పార్టీని మొగ్గలోనే తెంపివేయాలని ప్లాన్ చేస్తున్నారు . కొత్తగా పెట్టబోయే జనం తెలంగాణను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నే నిలుపుదల చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ తో విభేధించి భారతీయ జనతాపార్టీలో చేరిన ఈటెలను కేసీఆర్ మూడు చెరువుల నీరు తాగించారు. ఈటెలపై, ఆయన భార్యపై క్రిమినల్ కేసులను పెట్టించారు. జాతీయ పార్టీలో చేరి అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిన ఈటెలనే కేసీఆర్ వదల లేదు. అమిత్ షా అండదండలున్న ఈటెలపై బిఆర్ఎస్ వెనక్కి తగ్గింది. కానీ కొత్తగా వచ్చే జనం తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు జనం తెలంగాణలో చేరే అవకాశం లేదు. పసి కూన పార్టీలో చేరి నాయకులు ఇబ్బందులకు గురి కారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించే నేతలు కొత్త ప్రాంతీయ పార్టీలో చేరే అవకాశం లేదు. బీఆర్ఎస్ నుంచి విభేధించి బయటకొచ్చిన పొంగులేటి , జూపల్లిలు సైతం కొత్త రాజకీయ పార్టీ అంశాన్ని విరమించుకోనున్నారు. ఎందుకంటే వారికి కాంగ్రెస్, బిజెపి అధినాయకత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఖమ్మంజిల్లాలో తిరుగులేని నాయకుడు పొంగులేటి. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి ఖమ్మంలో బలహీనంగా ఉంది. ఓడిపోయే పార్టీలో ఏ నేత చేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.
చేరికల కమిటీ చైర్మన్ అయిన ఈటెలను జనం తెలంగాణ పార్టీలో చేరాలని కోరిన పొంగులేటి, జూపల్లిల కొత్త పార్టీకి మనుగడలేదని ఈటెల వారికి నచ్చ జెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త పార్టీకి నూకలు చెల్లినట్టు కనబడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-new-party-no-more--39-156197.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.