సచివాలయం సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే డిష్యుమ్-డిష్యుమ్
Publish Date:Jul 5, 2018
Advertisement
ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారం సాధించాలి అనుకుంటుంటే.. సొంత పార్టీ నేతలే ఆయనకి తలనొప్పిగా మారారు.. పవిత్రమైన సచివాలయం సాక్షిగా పంచాయితీలు చేస్తున్నారు.. ఈ పంచాయితీల పుణ్యమా అని తాజాగా ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒకరిమీద ఒకరు చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఓ భూమికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.. ఒకవైపు మంత్రి మద్దతుగా నిల్చున్నారు.. మరోవైపేమో ఎమ్మెల్యే అండగా నిల్చున్నారు.. అసలే ఇద్దరూ అధికార పార్టీ నేతలు.. మరి ఈ ఎవ్వారం అంత ఈజీగా తేలుతుందా?.. అందుకే ఆ మంత్రి సచివాలయంలో తన ఛాంబర్ కి పిలిపించుకున్నారు. ఓ వర్గం వైపు మంత్రి.. ఓ వర్గం వైపు ఎమ్మెల్యే.. ఇక పంచాయితీ షురూ అయింది.. అయినా వ్యవహారం ఎటూ తేలలేదు.. రెండు వర్గాల మధ్య వివాదం కాస్తా.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వివాదంగా మారిపోయింది.. మాట మాట పెరిగింది.. నీ అంతు చూస్తా అంటే నీ అంతు చూస్తా.. నువ్వు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తావో చూస్తారా.. నువ్వు మంత్రిగా ఎలా ఉంటావో చూస్తారా.. అంటూ పరిస్థితి చేయి దాటిపోయి చేయి చేసుకునే వరకు వచ్చింది.. ఒకరినొకరు పిడిగుద్దులు కూడా గుద్దుకున్నారట.. ఇది జరిగి వారం రోజులు అయినట్టు తెలుస్తుంది.. అయినా ఏ టీవీ ఛానల్ లో రాకపోవడం గమనార్హం.. అలానే మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి రాలేదు.. మరి ఈ ఘటన నిజంగా జరిగిందో లేక ఎవరైనా కల్పించారో తెలీదు కానీ.. పవిత్రమైన సచివాలయం సాక్షిగా ప్రజాప్రతినిధులు పంచాయితీలు చేయడం మాత్రం తప్పు అని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-minister-and-mla-fight-in-secretariat-39-82264.html





