తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కె.చంద్రశేఖరరావు టి.ఆర్.ఎస్. పార్టీ ఏర్పాటు చేయటానికి చాలా ముందుకాలం నుంచే ప్రొఫెసర్ కోదండరామ్ ఆంధ్రులపై విషం కక్కుతూ పలు పుస్తకాలు రాశారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఒకవైపు అద్యాపకుడిగా ప్రభుత్వ జీతం తీసుకుంటూనే మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర సమైఖ్యతకు భంగం కలిగించేలా ఉద్యమాలు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తీరును మెచ్చుకున్న కేసిఆర్ ఆయన్ను తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించారు. చాలాకాలం పాటు కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ ఒకేమాట, ఒకేబాటగా మెలిగారు. కొన్ని సందర్భాలలో కోదండరామ్ చెప్పినట్లే తెలంగాణా నాయకులూ, విద్యార్థులూ నడుచుకున్నారు. కోదండరామ్ ఒక పవర్ సెంటర్ గా మారటంతో కేసిఆర్ వైఖరిలో మార్పు వచ్చింది.
గత ఏడాది జెఎసి చేపట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. అనంతరం కొద్దికాలం క్రితం జరిగిన పాలమూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో జెఎసి వైఖరి కెసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది., ఈ ఎన్నికల్లో జెఎసి తెలంగాణారాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం, బిజెపి అభ్యర్థి గెలుపొండటంతో కెసీఆర్ తోకతొక్కిన తాచులా పైకి లేచారు. కోదండరామ్ పై పగబట్టారు. కోదండరామ్ వల్ల తెలంగాణా ఉద్యమం బలహీనపడుతోందని ఆరోపించారు. అసలు జెఎసిని ఏర్పాటు చేసింది తానే అని కానీ, కోదండరామ్ తనను ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారని కెసీఆర్ అంటున్నారు. తామే లేకపోతే జెఎసి ఎక్కడిదని ప్రశిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన పార్టీ 11వ వార్షికోత్సవ ప్రతినిధుల సభలో కోదండరామ్ ని అవమానించారు. గతంలో జరిగిన ప్రతినిధుల సభలో కోదండరామ్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ 28వ తేదీ నాటి సభలో ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా జెఎసి చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తప్పించటానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కోదండరామ్ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-joint-action-commitee-chairman-professor-kodandaram-in-troubles-24-13741.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!