తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తీసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలా నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ కేసును సుమోటోగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ నిర్ణయమే సుప్రీం అని, ఆయన అధికారాల్లోకి
కోర్టులు సాధ్యమైనంత వరకు ప్రవేశించవనే అభిప్రాయాలు వున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ని హైకోర్టు ఇలా ఆదేశించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన అంశంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్
నాయకులు హైకోర్టులో కేసులు వేశారు. దీని మీద స్పందించిన హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.
పదేళ్ళ క్రితం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు, నాయకులు ఉండకూడదనే పట్టుదలతో చాలామందిని ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ ఆహ్వానించి తన పార్టీలో
చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో మిగలకుండా చేశారు. అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌కి ఫిర్యాదు చేశాయి. అయితే స్పీకర్ అధికారం పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం తమ పార్టీలోంచి ఎమ్మెల్యేలు
జారిపోయారు కాబట్టి స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా?
తనకున్న విశేష అధికారాలను హైకోర్టుకు తెలియజేస్తారా అనేది సస్పెన్స్.గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-high-court-order-to-speaker-25-184510.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.