తెలంగాణలో 18 ఏళ్ల పైవారికి వ్యాక్సిన్.. సూపర్ స్ప్రెడర్స్ కు ఫస్ట్
Publish Date:May 25, 2021
Advertisement
తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు రూపొందించింది ఆరోగ్య శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని ఇప్పటికే అంచనా వేసింది. ఎక్కువగా జనంతో ఇంటరాక్ట్ అయ్యేవారిని... సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించారు. ఇలాంటి గ్రూపులు 25 ఉంటాయని.. ఒక్కో గ్రూప్ లో లక్ష మంది ఉంటారని లెక్క కట్టింది. ఇందులో ఆటో డ్రైవర్స్ సుమారు లక్ష మంది ఉంటారు. వీరికే మొదటగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తర్వాత వెజిటబుల్...మటన్...చికెన్ వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్స్, ఇస్త్రీ షాపులు, కిరాణా షాపు వ్యాపారులు, డెలివరీ బాయిస్, బార్బర్ షాప్స్.. ఇలా సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన అందరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని విదివిధానాలు రూపొందించింది తెలంగాణ ఆరోగ్య శాఖ.
http://www.teluguone.com/news/content/telangana-govt-planing-to-vacciene-auti-drivers-first-25-116211.html





