ఫ్యూచర్ సిటీకి వందేళ్ల నీటి భద్రత.!

Publish Date:Aug 7, 2026

Advertisement

హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది.  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది.   100 సంవత్సరాల పాటు నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా నదీ జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేందుకు బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

 మల్లన్న సాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది.  10 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో   డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. అందులో భాగంగానే మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నీటిలో 10 టీఎంసీలను హైదరాబాద్ నగర అవసరాలకు ఉపయోగించగా, మిగిలిన 5 టీఎంసీల జలాలను   ఫ్యూచర్ సిటీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వినియోగిస్తారు.

మరోవైపు..  నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం ఘన్‌పూర్ ప్రాంతంలో రోజూ 1,170 మిలియన్ లీటర్ల సామర్థ్యం   కలిగిన భారీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ శుద్ధీకరణ కేంద్రం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని పైప్‌లైన్   ద్వారా ఫ్యూచర్ సిటీలోని అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

నగరాలు   విస్తరిస్తున్న నేటి రోజుల్లో భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి నీటి వనరుల మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. మల్లన్న సాగర్, ఉద్దండాపూర్ వంటి   జలాశయాలను అనుసంధానం ద్వారా భవిష్యత్తులో నగరానికి నీటి కొరత అన్నదే లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.    

ప్రస్తుతం సిద్ధమైన డీపీఆర్‌కు అనుగుణంగా త్వరలోనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే దశాబ్దాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పెరిగే జనాభా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యతకు  కృష్ణా-గోదావరి నీటి తరలింపు ప్రాజెక్టు   కీలకమని పరిశీలకులు అంటున్నారు. 

Telangana Future City, Godavari and Krishna waters, Mallanna Sagar water, Uddandapur Reservoir, Ghanpur Water Treatment Plant

By
en-us Political News

  
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. !
2027 వన్డే ప్రపంచకప్‌నకు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్, క్వాలిఫైయర్ సమీకరణాలు, అఫ్గానిస్థాన్ విజయం విండీస్‌పై చూపిన ప్రభావం మరియు 14 జట్ల టోర్నీ అర్హత మార్గం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్ కేమరాన్ గ్రీన్‌తో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెస్టు గణాంకాలు మరియు ప్లేయింగ్ ఎలెవన్ విషయమై వెబ్‌స్టర్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఆరు నెలలకే  కవలలు జన్మించారు.
బ్రేకులు బాగుచేస్తుండగా ముందుకు కదిలిన బస్సు చక్రాల కింద నలిగి మెకానిక్ మృతి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.