తెలంగాణకు జలకళ!
Publish Date:Sep 25, 2024
Advertisement
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గండిపేట ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.90 అడుగులుగా ఉంది. శంకర్ పల్లి, పొద్దుటూర్, చేవెళ్ళ, మొయినాబాద్, మోకిలా ప్రాంతాల నుంచి భారీ వరద నీరు గండిపేట జలాశయానికి వచ్చి చేరుతోంది. ఇక హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. తాండూర్, వికారాబాద్, షాబాద్, వెంకటాపూర్ నుంచి భారీగా వరద ప్రవాహం హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్.కు చేరుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-full-lwater-39-185555.html
http://www.teluguone.com/news/content/telangana-full-lwater-39-185555.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





