Publish Date:Sep 20, 2026
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిం చిందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
ఫాంహౌజ్ వ్యవహారంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు.
భూదోపిడీ జరిగితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూముల స్వాధీ నంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్‌ను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ అధికార పార్టీ ఫాంహౌజ్ ను సందర్శించడం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిం చారు.రాష్ట్రంలో 22ఏ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్య లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తా మని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానేకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవా లను ప్రశాంతంగా నిర్వహించుకుందామని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తిశ్ర ద్ధలతో ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.
[ Bandi Sanjay Kumar, Congress party, Supreme Court, BJP, BRS, Danam Nagender, Khairatabad by-election, CM Revanth reddy ]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sanjay-kumar-39-231969.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.