దొంగిలించిన ఫోన్…తిరిగి చేతిలోకి...ఇది తెలంగాణ కొత్త చరిత్ర

Publish Date:Apr 27, 2026

Advertisement

 

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు. కానీ ఇప్పుడు ఆ కథ మారుతోంది. డిజిటల్ యుగంలో సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది.దొంగిలించ బడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రం 1,24,850 ఫోన్లు తిరిగి యజమానులకు అందిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.మొబైల్ దొంగతనాలను అరికట్టేం దుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూ నికేషన్స్  అభివృద్ధి చేసిన CEIR వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. పైలట్ రాష్ట్రాల తర్వాత 19 ఏప్రిల్ 2023న తెలంగాణ లో ఈ సేవ ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైన ప్పటికీ అమలులో మాత్రం తెలంగాణ వేగం చూపిం చింది. 

కేవలం మూడేళ్లలోనే దేశానికి ఒక కొత్త ప్రమా ణాన్ని ఏర్పరచే స్థాయిలో ఫలితాలు సాధించింది. 2023 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు నమోదైన గణాంకాలు రాష్ట్రం చేసిన కృషిని స్పష్టంగా చెబుతు న్నాయి. ఈ కాలంలో 1,24,850 మొబైల్ పరిక రాలు రికవరీ కాగా, 4,82, 652 పరికరాలు బ్లాక్ చేయబడ్డాయి. మరో 2,82,260 పరికరాలను ట్రేస్ చేసి అన్‌బ్లాక్ చేశారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాకుండా వేలాది కుటుంబా లకు తిరిగి చేరిన విలువైన డేటా, జ్ఞాపకాలు, జీవనా ధారాన్ని ప్రతిబింబిస్తు న్నాయి.ఈ విజయానికి వెనుక ఉన్న ప్రధాన బలం తెలంగాణ పోలీసులు  మరియు CID  సమన్వ యం మాత్రమే.... రాష్ట్రం లోని 780 పోలీస్ స్టేషన్లలో CEIR వ్యవస్థను పూర్తిస్థా యిలో అమలు చేయడం ద్వారా ఫిర్యాదు నమోదు నుంచి మొబైల్ తిరిగి యజమానికి అప్పగించే వరకు ఒక క్రమబద్ధమైన విధానం అమల్లోకి వచ్చింది. 


నోడల్ అధికారులు, పోలీస్ స్టేషన్ స్థాయి ఆపరేటర్లకు విస్తృత శిక్షణ ఇవ్వడం, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించే కోర్ టీమ్ ఏర్పాటు చేయడం, జిల్లాల పనితీరును నిరంతరం సమీక్షించడం వంటి చర్యలు ఈ విజయా నికి పునాది అయ్యాయి.ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టడం కూడా కీలకంగా మారింది. ఇప్పుడు పౌరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయగలుగుతు న్నారు. 

ఇతర రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్న మొబైల్ పరికరాలను కూడా తిరిగి రాబట్టేందుకు పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ఎంత గంభీరం గా అమలు అవుతుందో చూపుతోంది.పోగొట్టుకున్న మొబైల్ తిరిగి చేతిలో పడినప్పుడు ప్రజల ముఖా ల్లో కనిపించే ఆనందమే ఈ కార్యక్రమానికి అసలైన విజయం. డిజిటల్ భద్రతలో తెలంగాణ సాధించిన ఈ ఘనత ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరకడం అసాధ్యం కాదు” అనే నమ్మకాన్ని తెలంగాణ పోలీసులు సాకారం చేశారు.

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.