మీ మొసలి కన్నీరు ఆపండయ్యా!
Publish Date:Jul 14, 2014
Advertisement
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకూడదు, అసలు పోలవరం ప్రాజెక్టే కట్టకూడదు.. ఇంకా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు.... ఇది పార్టీలకి అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులందరికీ వున్న ఏకాభిప్రాయం. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అందరూ యథాశక్తి అడ్డుపడుతున్నారు. చివరికి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే, పోలవరం ప్రాజెక్టును ఇస్తున్నామనే సాకును చూపించి హైదరాబాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యసభ ముంగిట వుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట వింటే ముసలి కన్నీరు అనే మాటకి అర్థం క్లియర్‌గా తెలుస్తుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, వి.హనుమంతరావు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు కట్టడం ఘోరం, నేరం అన్నట్టుగా మాట్లాడారు. ఇలాంటి మాటలు మామూలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ మొసలి కన్నీరు కారుస్తూ మాట్లాడిన మాటలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కడుపులో మండేట్టు చేస్తున్నాయి. రాపోలు ఆనందభాస్కర్ గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ అర్జెంటుగా మార్చేయాలట. లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాజమండ్రి నగరం మునిగిపోతుందట. అలాగే మరో కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా కడితే అమలాపురం మునిగిపోతుందట. సీమాంధ్ర మీద విషం కక్కే ఈ ఇద్దరు నాయకులు రాజమండ్రి, అమలాపురం మీద చూపిస్తున్న ఈ అతి జాలిని మొసలి కన్నీరు అనకుండా ఇంకేమనాలి? అయ్యా పెద్దమనుషులూ.. ఇప్పటికైనా మీ మొసలి కన్నీరు ఆపండయ్యా.. లేకపోతే మీ కన్నీటితోనే పోలవరం ప్రాజెక్టు నిండిపోయి రాజమండ్రి, అమలాపురం మునిగిపోతాయి.
http://www.teluguone.com/news/content/telangana-congress-leaders-crying-for-polavarm-project-45-35895.html





