రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ?

Publish Date:Mar 15, 2025

Advertisement

 తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు?  అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్  మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది?  అంటే  స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్  అధిష్టానం  కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని   విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్  వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ముఖ్యమంత్రి   పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని,  సో .. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరగే అవకాశాలు అంతగా  లేవనీ  ఒక విధంగా చెప్పాలంటే  మంత్రి వర్గ విస్తరణ నిరవధికంగా వాయిదా పడినట్లేనని అంటున్నారు. 

నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సహా మరి కొన్ని మంత్రులు లేని శాఖల పరిస్థితి అక్క మొగుడే’ దిక్కన్నట్లు తయారైందని  అధికార వర్గాలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో  ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మత్రులున్నారు. మరో ఏడుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానంతో సంబంధాలు బాగున్న రోజుల్లో  ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా  పార్టీ అధిష్టానం ముందుంచిన ఎజెండాలో మంత్రి వర్గ విస్తరణ తప్పక ఉండేదని అంటారు.

అంతే కాదు  రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మరో ఒకటి రెండు సార్లు మంత్రి పొంగులేటి, ఇతర మంత్రులు మంత్రి వర్గ విస్తరణ కొంచెం అటూ ఇటుగా ఫలానా తేదీ లోగా ఉంటుందని ముహూర్తాలు కూడా నిర్ణయించారు. అయితే ముహూర్త తిథులు, తేదీలు  వచ్చాయి,  పోయాయి కానీ  మంత్రి వర్గ విస్తరణకు  ముడి  పడలేదు. 

అదలా ఉంటే, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఒకటి కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కారణాలు వేరైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ విచారణ నివేదిక ఆధారంగానే ఉద్వాసనకు నిర్ణయం జరిగిందని  సో, ఆ ముగ్గురుకి ఉద్వాసన తప్పక పోవచ్చనే  ప్రచారం జరుగుతోంది.   
అదొకటి  అలా ఉంటే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా నేరుగా ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్న విజయ శాంతికి కాబినెట్ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా, మరో ముగ్గురు కొత్త వారికి అవకాశం దక్కే అవకాశం  ఉందని అంటున్నారు. అయితే  ఇందంతా జరిగేది ఎప్పుడు  అంటే మాత్రం  ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోతున్నారు. ముందుగా ప్రస్తుతానికి ఆలోచ , విచారణ దశలోనే ఉన్న ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకున తర్వాతనే మంత్రి వర్గ నిర్ణయం ఉంటుందని  ఢిల్లీతో టచ్ లో ఉన్న నాయకులు అంటున్నారు. 

అయితే అదే సమయంలో  ముఖ్యమంత్రి మార్పు పై నిర్ణయం అంత సులభంగా తేలే వ్యవహారం కాదని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని అధిష్టానానికి కూడా తెలుసని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరి వెంట ఎంత మంది ఉన్నారు, ఇతర పార్టీలతో టచ్’లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, లేదా ఇతర  ముఖ్య నాయకులతో  టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? వంటి వివరాలన్నీ అధిష్టానం సిద్దం చేసుకుందని అంటున్నారు. అలాగే, ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు గోడ దూకుడు లెక్కలకు సంబంధించి వివరాలు సైతం  అధిష్టానం వద్ద ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది.  సో.. ఎలా చూసినా కాంగ్రెస్ అధిష్టానం తొందరు పాటు నిర్ణయం తీసుకోదని అంటున్నారు.  సో... చివరికి ఏ  నిర్ణయం తీసుకోకపోవడమే ఉత్తమ నిర్ణయంగా అధిష్టానం తీసుకున్నా  తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.  ఇదలా ఉంటే రామాయణంలో పిడకల వేట అన్నట్లు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పని కాదని, రాములమ్మలా నేరుగా దేహికి వెళ్లి మంత్రి పదవి తెచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.