Publish Date:Oct 30, 2024
ఇటీవలికాలంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ వియానాశ్రయంలో ఏకంగా ఆరు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ సిబ్బందికి ఎదురయ్యాయి.
Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది.
Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగానూ, రాజకీయంగానూ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులందరి మద్దతూ లభించింది. ఇటు కుటుంబం కూడా ఆయన వెన్నంటి నడిచింది. ఇలా అన్ని వైపుల నుంచీ, అందరి నుంచీ మద్దతు లభించడం వల్లనే ఆయన తన వైసీపీ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ నడపగలిగారు, 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగారనడంలో సందేహం లేదు.
Publish Date:Oct 30, 2024
సీబీఐ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ గా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వెంకట సుబ్బారెడ్డి ఐపీఎస్ ను సీబీఐ డిఐజీగా నియమిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు.
Publish Date:Oct 30, 2024
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Publish Date:Oct 30, 2024
జన్వాడ పార్టీ రేవ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మద్దూరీ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.
Publish Date:Oct 30, 2024
కడపలో అన్న క్యాంటిన్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అన్న క్యాంటిన్ వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది.
Publish Date:Oct 30, 2024
ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగలక తప్పదా? 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పడమే కాకుండా, వీలయితే 30శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
Publish Date:Oct 30, 2024
మంత్రి కొండాసురేఖపై పరువు నష్టం దావావేసిన నేపథ్యంలో గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున కుటుంబంపై కొండాసురేఖ స్టేట్ మెంట్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉందని మాజీ మంత్రి కెటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Publish Date:Oct 30, 2024
ఇటీవలి కాలంలో విమానాల్లో బాంబులు పెట్టామంటూ బెదరింపు కాల్స్ రావడం ఎక్కువైంది. గత కొన్ని రోజులుగా విమానాశ్రయాలకు బాంబు బెదరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా బుధవారం (అక్టోబర్ 30) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికీ బాంబు బెదరింపు కాల్ వచ్చింది.
Publish Date:Oct 30, 2024
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించిన నారా లోకేశ్... ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొన్నారు. లాస్ వెగాస్ లో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్నలోకేష్ పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
Publish Date:Oct 29, 2024
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాను పట్టిన కుదేలుకు మూడే కాళ్లు అని ప్రజలను నమ్మించడంలో దిట్ట. జగన్ మూర్ఖత్వానికి జైజైలు పలికేందుకు వైసీపీ ముఖ్యనేతలు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీనికితోడు వైసీపీ సొంత మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా ఉండనే ఉంది. ప్రజలను పిచ్చివాళ్లు అన్నట్లుగా వారు ట్రీట్ చేస్తారు. తామేంచెబితే అది జనం నమ్మేస్తారని వారి నమ్మకం. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారు.
Publish Date:Oct 29, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (అక్టోబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.