Publish Date:Jul 25, 2024
తెలంగాణ వార్షిక బడ్జెట్ ను డెప్యుటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం 2,91,159 కోట్లతో భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో ప్రారంభించారు. గత పదేళ్లో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగిందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారిగా అసెంబ్లీకి హాజరయ్యారు.
కాగా భట్టి విక్రమార్క బడ్జెట్ లో వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులుఇలా ఉన్నాయి.
* హోం శాఖ రూ. 9,564 కోట్లు
* వైద్యం ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
* ఐటీ రంగం రూ. 774 కోట్లు
* నీటిపారుదల శాఖకు రూ. 22,301 కోట్లు
* ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు
* పరిశ్రమల శాఖ రూ. 2,762 కోట్లు
* విద్యారంగం రూ. 21,292 కోట్లు
* ట్రాన్స్కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు
* అడవులు పర్యావరణం రూ. 1,064 కోట్లు
* బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
* ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
* మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
* ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు
* మెట్రో వాటర్ వర్క్స్ - రూ. 3,385 కోట్లు
* హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు
* జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన - రూ. 3,065 కోట్లు
* హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు
* విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ రూ. 100 కోట్లు
* హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
* మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
* ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
* పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు
* మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూ. 50 కోట్లు
* ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
* రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ. 723 కోట్లు
* గృహజ్యోతి పథకం కోసం రూ. 2,418 కోట్లు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-budget-2-39-181478.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?