బీజేపీకి అగ్నిపరీక్ష... సత్తా చాటకపోతే అంతే సంగతులు...

Publish Date:Dec 30, 2019

Advertisement

మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనివిధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో... టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంటూ బీజేపీ చెప్పుకున్నా... మిగతా ఏ ఎన్నికల్లోనూ ఆ స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. ఇక, ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే మున్సిపోల్స్ లో బీజేపీకి మంచి ఫలితాలు సాధించి పెడతాయని భావిస్తున్నారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ పై నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నా... హిందూవర్గాల్లో చాలా సానుకూలత ఉందని, అదే తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు. 

మున్సిపోల్స్ లో ఒంటరి పోరుకు దిగుతోన్న బీజేపీ... గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టింది. మోస్తరు ఓట్లు సాధించిన మున్సిపాలిటీల్లో నేరుగా ప్రజలను కలవాలని నిర్ణయించింది. అలాగే, మున్సిపాలిటీల వారీగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అంతోఇంతో పట్టుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై దృష్టిపెడుతున్నారు. అలాగే, ప్రజల్లో పేరున్న చోటామోటా నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక క్లస్టర్ గా తీసుకొని నలుగురిని ఇన్ ఛార్జులుగా నియమిస్తున్నారు.

మొత్తానికి మున్సిపోల్స్ ను బీజేపీ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి... 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అయితే, ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ ఇష్యూస్.... తెలంగాణ మున్సిపోల్స్ లో బీజేపీకి బలంగా మారతాయో లేక డిపాజిట్లు దక్కకుండా చేస్తాయో చూడాలి.

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.