తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ నో.!

Publish Date:Aug 8, 2026

Advertisement

జనసేన పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీతో తెలంగాణలో పొత్తు ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టింది. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ పొత్తు యథాతథంగా ఉంటుంది.  పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి  ప్రభుత్వాన్ని  నడిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ  కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులకు మాత్రమే పరిమితమని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పొత్తు ప్రశక్తే లేదనీ బీజేపీ విస్పష్టంగా తేల్చేసింది. 

తెలంగాణలో  త్వరలో జరగబోయే  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ  ఒంటరిగా బరిలోకి దిగాలని సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  కీలకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో పవన్ కళ్యాణ్‌కు   సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ,  జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతాయని పరిశీలకులు భావించారు. అయితే.. తెలంగాణ బీజేపీ నాయకత్వం మాత్రం ఈ అంచనాలను తలకిందులు స్వతంత్రంగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించింది. 

 హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బీజేపీకి సుదీర్ఘకాలంగా బలమైన ఓటు బ్యాంక్,  క్షేత్రస్థాయి కార్యకర్తల నెట్‌వర్క్ ఉంది. దీంతో  సొంతంగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు  పట్టుదలతో ఉన్నారు. అందుకే తెలంగాణ పరిధిలో ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని భావిస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో జనసేన పార్టీకి గతంలో ఆశించిన స్థాయిలో  ఫలితాలు రాలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో జనసేన పరిమిత స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయింది.  ఈ పరిస్థితుల్లో  బీజేపీ పొత్తుకు నో చెప్పడంతో  తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందా లేదా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.  

Telangana BJP, Jana Sena Party, Pawan Kalyan, GHMC Elections, BJP Alliance Telangana, Telangana Politics

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.