Publish Date:Apr 27, 2025
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Publish Date:Apr 27, 2025
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు. రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు.
Publish Date:Apr 27, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి.
Publish Date:Apr 27, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయ్. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు… అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదని ఎంపీ చామల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Publish Date:Apr 27, 2025
. ప్రతి భారతీయుడూ ఈ దాడి పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారని దాడికి పాల్పడిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదం అంతానికి కంకణం కట్టుకున్నట్లు ఉద్ఘాటించారు.
Publish Date:Apr 27, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరువాడా సిద్ధమైంది. పోరాటాల గడ్డ ఓరుగల్లుకు తెలంగాణ రాష్ట్ర నుంచి నలుదిక్కులా ప్రజలు తమ ఇంటి పండుగలా భావించి వెల్లువలా కదిలివస్తున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో గులాబీ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అలాగే పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో ఎల్కతుర్తిలో జరగనున్న సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
Publish Date:Apr 27, 2025
గత ప్రభుత్వం హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలని కుట్ర పన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందనేది సీఐడీ ఆరోపణ. ఇది నిజం అనేలా పలు రకాల ఆధారాలు సైతం సేకరించింది. ఇందులో పాత్ర ఉందని అనుమానాలు ఉన్న వారికి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ను సంపాదించిన సిట్ యాక్షన్ లోకి దిగింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అయినా , అర్థరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగి గౌతమ్ తేజ్ ను అరెస్టు చేశారు. అక్కడే పని చేస్తున్న మాజీ ఆర్డీవో, ఆర్డీవో ఇతర అధికారుల పై సైతం చర్యలు తీసుకున్నారు.
Publish Date:Apr 27, 2025
ఉగ్రదాడికి భారత్ గట్టి బదులే ఇస్తుంది. అది మరెవ్వరూ ఊహించనదిగా ఉంటుంది. ఇదీ మోడీ పహెల్గామ్ అటాక్ తర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోడీ. యుద్ధం చేయడం కంటే నీళ్లు ఆపడం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వచ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగని ఇదే చాలనుకున్నా కష్టమే. ఎందుకంటే ఇందుకు కావల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్రదాడులు జరిగే అవకాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామని.. ఈ సరికే ప్రకటించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావర్ భుట్టో సైతం సరిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భారత్ ను హెచ్చరించాడు.
Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్‌లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దాడి అనంతరం రెండు రోజుల పాటు వ్యూహాత్మక మౌనంతో మోడీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు.
Publish Date:Apr 26, 2025
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Apr 26, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Publish Date:Apr 26, 2025
టీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రలో స్థిరంగా నిలిచి పోయే ఒక చారిత్రిక సత్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పుష్కర కాలానికి పైగా సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది.