రక్తదానం కాదు.. డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమా..కేటీఆర్‌కు బల్మూర్ వెంకట్ సవాల్..!
Publish Date:Jul 13, 2026
Advertisement
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో రక్తదాన శిబిరాలు నిర్వహించడం కంటే కేటీఆర్ స్వయంగా రక్తదానం చేసి తన బ్లడ్ శాంపిల్‌ను పరీక్షకు పంపించాలని సవాల్ విసిరారు."కేటీఆర్ రక్తదానం చేసి బ్లడ్ శాంపిల్ పంపిస్తే డ్రగ్ టెస్ట్ చేయిస్తా.... అప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉందో...ప్రజల ముందే తేలిపోతుంది" అని బల్మూర్ వెంకట్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో తాను విసిరిన "వైట్ టెస్ట్" సవాల్‌ను కేటీఆర్ స్వీకరించలేదని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నిజంగా తప్పు చేయకపోతే పరీక్షలకు ఎందుకు వెనుకా డాలని ప్రశ్నించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణలో డ్రగ్స్ సంస్కృతి విస్తరించిం దని ఆరోపించిన బల్మూర్ వెంకట్, యువతను మత్తు పదార్థాల బారిన పడే పరిస్థితులు అప్పటి పాల కుల వైఫల్యాల ఫలితమే నని విమర్శించారు. అంతేకాకుండా,"పదేళ్లపాటు ప్రజల రక్తాన్ని రాబందుల్లా పీల్చుకున్న వారు, ఇప్పుడు రక్తదానం పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయ డమే" అంటూ కేటీఆర్‌పై ఘాటు విమర్శలు కురిపించారు. కేటీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి రక్తదానం చేసి బ్లడ్ శాంపిల్ పరీక్షకు పంపాలని, అప్పుడే అన్ని అనుమానాలకు తెరపడుతుందని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు
http://www.teluguone.com/news/content/telangana-bhavan-blood-donation-36-225860.html





