ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అసెంబ్లీ సెషన్

Publish Date:Dec 17, 2023

Advertisement

దాదాపు దశాబ్దం తరువాత భారత్ లో ప్రజాస్వామ్యం ఇంకా ఉందన్న నమ్మకం కలిగేలా ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. నిజం 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశంలో చట్ట సభల తీరు దారుణంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరిన తరువాత చట్ట సభల నిర్వచనమే మారిపోయిందా అనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్లమెంటు సమావేశాల తీరులో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. విపక్షాలను మాట్లాడనీయకపోవడం, వారి అనివార్యంగా స్పీకర్ పోడియం ను చుట్టుముట్టే పరిస్థితులు వచ్చేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, తరువాత స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విపక్ష  సభ్యులను సస్పెండ్ చేయడం. క్రమంగా ఈ తీరు బీజేపీ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలకూ పాకింది.

ఇక రాష్ట్ర విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరితే.. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ అసెంబ్లీ అప్పటి నుంచీ ఏక వ్యక్తి ఆధిపత్యం అన్నట్లుగానే సాగింది. కేసీఆర్ కనుసన్నలలో అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. విపక్షంలో గట్టిగా మాట్లాడే వారిని సస్పెండ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా అధికార పార్టీ తీరు ఉండేది. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందనరావు వంటి వారు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టినప్పటికీ వారికి సభలో మాట్లాడే అవకాశం కాదు, అసలు సభలో కూర్చునే అవకాశం కూడా లేకుండా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీలో 2014 నుంచి 2019 వరకూ సభలో అనుచిత సంఘటనలు చోటు చేసుకున్నా.. సభా కార్యక్రమాల నిర్వహణ సజావుగా ఉండేందుకు అప్పటి అధికార పక్షం ప్రయత్నించింది. కానీ 2019 ఎన్నికలలో విజయం సాధించిన జగన్ పార్టీ.. అసెంబ్లీ నిర్వహణను పూర్తిగా సొంత వ్యవహారంగా పరిగణించింది. స్పీకర్ తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. నిత్యం విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, ఏకపక్షంగా ప్రసంగాలతో అసెంబ్లీ సమావేశాలంటేనే జనం పట్టించుకోవడం మానేసేలా పరిస్థితి మారిపోయింది.  ఇక రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలంటే ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలకు కూడా ఆసక్తి లేదనిపించేలా పరిస్థితి మారిపోయింది.

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ  జరిగినన్ని రోజులూ అసెంబ్లీ కళకళ లాడుతూ ఉండేది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సభ్యులు కూడా ఉత్సాహంగా చర్చలో పాల్గొనే వారు.  అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ప్రజా సంఘాల హడావిడి కనిపించేది. ఇందిరా పార్క్  వద్ద ‘ధర్నా చౌక్’ ఉన్నంత వరకు  అనేక ప్రజా సంఘాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉండేది. అలాగే, సామాన్య ప్రజల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగతున్నాయంటే, అదో రకమైన ఉత్కంఠ ఉండేది. అయితే రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలంటే ఒక మొక్కుబడి తంతు అన్నట్లుగా తయారైంది.  ఆరు నెలలకు ఒకసారి తప్పక అసెంబ్లీ సమావేశం కావాలనే రాజ్యాంగ నిబంధన ఉడడం వల్ల కా నీ లేకుండా  అసలు అసెంబ్లీ సమావేశాలే అవసరం లేదన్నట్లుగా అప్పటి ప్రభుత్వం తీరు ఉండేది. అందుకే సభకు సభ్యుల హాజరు అతి తక్కువగా ఉండేది.  

అటువంటి పరిస్థితుల్లో తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణలో మూడో అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రత్యేకత చాటుకున్నాయి. కనుమరుగైపోయిన సభా సంప్రదాయాలు, విలువలు మళ్లీ తెరపైకి వచ్చాయి. విపక్షం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా అధికార కాంగ్రెస్ సంయమనంతో వ్యవహరించింది. విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తూనే, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపింది. సస్పెన్షన్ల మాటే ఉండదనీ, తమ ప్రభుత్వం విపక్షాల సూచనలను స్వీకరిస్తుందనీ, ఏ అంశంపైనైనా సరే చర్చకు ముందుకు వస్తుందనీ, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయదనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చర్చ జరిగింది. చర్చలో ఎవరిది పైచేయి అన్నది అప్రస్తుతం. అసలు అసెంబ్లీలో చర్చలు జరిగే వాతావరణమే గత పదేళ్లుగా కనిపించలేదు. అటువంటిది కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే ముందు ముందు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలిసిపోయింది. చర్చలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం  ఏర్పడింది. ఈ తీరు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్రజాస్వామ్య వాదులు ఆకాంక్షిస్తున్నారు. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.