Publish Date:Apr 29, 2025
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. రేపు.. అంటే ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. .ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి రిజల్ట్స్ విడుదల చేస్తారని సమాచారం.మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-25-197161.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.