సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు.. కవితకు లభించని ఊరట.. కేసీఆర్ మళ్లీ దెబ్బతిన్నారుగా?

Publish Date:Oct 31, 2022

Advertisement

తెలంగాణలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దు చేసింది టీఆర్ఎస్ సర్కార్ నిజానికి ఇందుకు సంబంధించిన జీవో ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ..  ఇప్పుడు బయటపెట్టారు. ఇప్పటి దాకా గోప్యంగా ఉంచి ఇప్పుడు బయటపెట్టేందుకు కారణం కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత  సీబీఐ విచారణ బోనులో నిలబడకుండా కాపాడుకోవడానికేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో సోదాలు నిర్వహించింది. కవిత సన్నిహితుడు బోయనపల్లి అభిషేక్ రావును అరెస్టు చేసింది.  

అప్పుడెప్పుడూ రాష్ట్రంలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దయ్యిందని బయటపెట్టని కేసీఆర్  సర్కార్   ఇప్పుడు దానిని బయటపెట్టడం వెనుక ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశం ఉందన్న భయమే కరణమని పరిశీలకులు అంటున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో మరిన్ని సోదాలను, కవిత సహా మరింత మంది విచారణను సీబీఐకి జనరల్ కన్సెంట్ నిరాకరిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ఇసుమంతైనా అడ్డుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఢిల్లీలో నమోదైన లిక్కర్ స్కాం దర్యాప్తులో  భాగంగా  తెలంగాణలో ఎవరినైనా విచారించాల్సి వస్తే, కవితనైనా సరే .. ఆ   తెలంగాణ సర్కార్ తాజాగా  జారీ చేసిన ఉత్తర్వులు ఏ విధంగానూ ఆపజాలవు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా ఢిల్లీలోనే నమోదైంది. ఆ కేసు మూలాలు తెలుగు రాష్ట్రాలలో  ఉన్నాయని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. దీంతో  తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా ఏం ఫరక్ పడదు. సీబీఐ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలంగాణకు వచ్చి డిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును కొనసాగించే అధికారం ఆ దర్యాప్తు సంస్థకు ఉంది.

అలాగే దర్యాప్తులో భాగంగా కవిత సహా ఎవరిని విచారించాలనుకున్నా ఎలాంటి అడ్డంకులూ ఉండవు. వాస్తవానికి రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినంత మాత్రాన సీబీఐ ఆయా రాష్ట్రాలలో అడుగుపెట్టకుండా, దర్యాప్తు చేయకుండా ఆ రద్దు అడ్డుకోజాలవు.  దర్యాప్తు కొనసాగించాలని కోర్టులు ఆదేశిస్తే… రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏం ఉండదు. తెలంగాణ అందుకు మినహాయింపేమీ కాదు.  తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల మహా అయితే ఏం అవుతుందంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసు నమోదైతే.. ఆ వివరాలను సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే దర్యాప్తులో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే  రాజకీయ పరమైన కేసుల విచారణకు సీబీఐ కోర్టుకెళ్లి జీవోలు రద్దు చేయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణలుగా  . లాలూ ప్రసాద్ యాదవ్‌ ,  వీరభద్రసింగ్‌,   మధుకోడాల ఉదంతాలు ఉన్నాయి.  

ఇక ఇప్పటి వరకూ తమ రాష్ట్రాలలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ 9వ రాష్ట్రంగా అవతరించింది. వాస్తవానికి జనరల్ కన్సెంట్ ఉంటే..  రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏదైనా ఒక కేసు దర్యాప్తును ఆ రాష్ట్రంలో సీబీఐ చేపట్ట వచ్చును. ఈ జనరల్ కన్సంట్ ను రద్దు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 30న జీవో జారీ చేసింది. ఈ జోవోను తెలంగాణ సర్కార్ శనివారం (అక్టోబర్ 29) బయటపెట్టింది. తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయడంతో తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ జీవో రద్దు చేసిన సంగతి బయటపడింది. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ బీజేపీ దాఖలు చేసిన విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినా ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ యథేచ్ఛగా ముందకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర బయట నమోదైన  కేసులలో జనరల్ కన్సెంట్ రద్దైన రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులు ఉంటే.. వారిని సీబీఐ విచారించడాన్ని ఆ రద్దు ఏ విధంగానూ అడ్డుకోలేదు. అంటే ఎమ్మెల్సీ కవితకు ఈ జనరల్ కన్సెంట్ రద్దు వల్ల ఎలాంటి ఊరటా లభించే అవకాశం లేదు. దీంతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.