అధిష్టానంపై'టి'ఎంపీల ఒత్తిడి ఫలించలేదు : కేకే
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానంపై టి.ఎంపీలు చేసిన ఒత్తిడి ఎంతమాత్రం ఫలించలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు.తెలంగాణపై తమది రాజీ లేని పోరాటమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్లమెంటు సమావేశాల్లోగా సానుకూల ప్రకటన రావాలని ఆయన అన్నారు. చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో తాము మరోసారి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడో లోపం జరిగిందని, లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.తెలంగాణలో ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందని అన్నారు.త్వరలో తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.తెలంగాణ కోసం ఆంధ్రా నేతలతోనూ చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వివాదాలకు దారితీయడం బాధాకరమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము కొట్టుకుపోతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం వ్యర్థమని ఆయన అన్నారు. ఇక రాష్ట్రమంత్రి శంకర్రావును తొలగించడం దురదృష్టకరమన్నారు. ఆయనను ఢిల్లీకి పిలిపించి మాట్లాడితే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడికిక్కడే తొలగించడం బాధాకరమని చెప్పుకొచ్చారు.
http://www.teluguone.com/news/content/telangana-24-11096.html





