ఎజెండా లేదు..'టీ'జెఎసిను విమర్శించిన కేసీఆర్
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎజెండా లేకుండా సమావేశానికి వచ్చారని కెసిఆర్ తెలంగాణ జెఎసి నాయకులను విమర్శించినట్లు సమాచారం. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడానికి తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. దీర్ఘ కాలిక ఉద్యమానికి కార్యాచరణను రూపొందించాలని ఆయన జెఎసి నాయకులకు సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కన్నా తెలంగాణ జెఎసియే పవర్ ఫుల్ అని ఆయన అన్నారు. దీర్ఘ కాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశం రేపు శనివారం మరోసారి జరుగుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మలి దశ ఉద్యమాన్ని రూపొందిస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. సీమాంధ్ర ఉత్పత్తులను బహిష్కరించడం ఆచరణ సాధ్యం కాదని జెఎసి అభిప్రాయపడింది. టెట్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/telangana-24-11084.html





