కడప మహానాడు కమిటీల్లో తెలంగాణ టీడీపీ నేతలు.. సంకేతమదేనా?

Publish Date:May 22, 2025

Advertisement

తెలుగుదేశంపార్టీ  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో  తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది. అంతే కాకుండా తెలంగాణ అంశాలపై కూడా ఈ మహానాడులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో  పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.  

తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, తీసుకొస్తానని చంద్రబాబు ఇప్పటికే పలు సార్లు బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉన్నప్పటికీ  పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహించే నాయకులకే కొరత ఉందన్నది తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే మహానాడులో తెలంగాణలో పార్టీ పటిష్టతపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే మహానాడు కమిటీల్లో తెలంగాణ పార్టీ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు.  మహానాడు ఆహ్వాన కమిటీలో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు,  తీర్మానాల కమిటీలో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాధ్, సామ భూపాల్ రెడ్డికి స్థానం కల్పించారు. అలాగే  వసతుల కమిటీలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ అరిఫ్ లకు,  మహానాడు వేదిక కమిటీలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశమిచ్చారు. భోజనాల కమిటీలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండి పుల్లయ్య, అజ్మీరా రాజునాయక్, జనగాం నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియా కమిటీలో తెలంగాణ తెలుగుదేశం నేతలు తిరునగిరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్ధిక వనరుల కమిటీలో గడ్డి పద్మావతి, నెల్లూరి దుర్గాప్రసాద్ కు చోటుకల్పించారు. వీళ్ళే కాకుండా ఇంకా అనేక కమిటీల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు  అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించటమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోను సభ్యత్వ నమోదు  కార్యక్రమం నిరాఘాటంగా జరుగుతునే ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దాదాపు 4 లక్షల సభ్యత్వాలున్నాయి. కడపలో మహానాడు తర్వాత ఇక జాప్యం లేకుండా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారంటున్నారు. తెలంగాణలో ఎంపికచేసిన    నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టు ఉన్న   రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో  ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిం చాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.   

By
en-us Political News

  
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.