మస్క్‌కు తీన్మార్ మల్లన్న ట్వీట్.. కేటీఆర్‌కు బిగ్ షాక్..
Publish Date:Jan 17, 2022
Advertisement
తెలంగాణలో టెస్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే కలిసి పని చేద్దామంటూ టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌కు కేటీఆర్ ట్వీట్ చేయగా.. లేటెస్ట్గా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న సైతం మస్క్‌కు ఓ ట్వీట్ చేశారు. అయితే, మల్లన్న ఏమీ పెట్టుబడులు పెట్టమని అడగలేదు. పరోక్షంగా ఇక్కడికి రావొద్దని.. కేటీఆర్ ఉత్త వేస్ట్ మినిస్టర్ అని ఎలన్ మస్క్‌కు తెలిసేలా చేశారు. అయితే, మల్లన్న ఓవరాక్షన్‌పై గులాబీ శ్రేణులు, పారిశ్రామిక వర్గాలు మండిపడుతున్నాయి. ఆయన చేసిన పని.. తెలంగాణ అభివృద్ధికే విఘాతమని విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే... తెలంగాణలో టెస్లా పెట్టుబడులు పెట్టాలంటూ ఎలాన్ మాస్క్ ను ఆహ్వానిస్తూ ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై బీజేపీ నేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఓ పోల్ నిర్వహించారు. 'పెట్టుబడులకు తెలంగాణ చాంపియన్' అంటున్న కేటీఆర్ మాటలు నిజమేనా? అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. నిజమే.. పచ్చి అబద్దం.. అని రెండు ఆప్షన్లను ఇచ్చారు. ఆ పోల్ ఫలితాలను తాజాగా తీన్మార్ మల్లన్న రిలీజ్ చేశారు. నిజమే అంటూ 19శాతం మంది సమాధానం ఇచ్చారని.. పచ్చి అబద్దం అని 81 శాతం మంది ఓటు వేశారని ప్రకటించారు. ఈ పోల్ రిజల్ట్స్ ను తీన్మార్ మల్లన్న ఏకంగా ఎలన్ మస్క్ కు ట్వీట్ చేశారు. 33 వేల మంది పాల్గొన్న ఈ ఒపినీయన్ పోల్ ఫలితాలు ఇవీ అంటూ వివరించారు. కేటీఆర్ ఫెయిల్ మినిస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ను దానికి జతచేశారు. తీన్మార్ మల్లన్న మస్క్‌కు చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వచ్చే పెట్టుబడులు రాకుండా చేస్తావా? అంటూ నెటిజన్లు మల్లన్నపై మండిపడుతున్నారు. పెట్టుబడులు అభివృద్ధి విషయంలో రాజకీయాలను లాగవద్దని హితవు పలుకుతున్నారు. కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలని.. తెలంగాణ ఇమేజ్ను ఇలా దిగజార్చవద్దని తీన్మార్ మల్లన్నపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇంతకుముందు కేటీఆర్ తనయుడిపై బాడీ షేమింగ్ పోల్ పెట్టి కాంట్రవర్సీకి కారణమైన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడిలా టెస్లా యజమాని ఎలన్ మస్క్‌కు కేటీఆర్‌పై పెట్టిన పోల్ రిజల్ట్స్‌ను పోస్ట్ చేసి.. పరోక్షంగా తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం కాదనేలా చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తీన్మార్ మల్లన్న తీరు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.
http://www.teluguone.com/news/content/teenmar-mallanna-tweet-to-elon-musk-on-ktr-39-130289.html





