ఈటలకు అన్యాయం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ

Publish Date:Mar 24, 2021

Advertisement

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. ఈ పేరు తెలంగాణలో ఇప్పుడు ఓ వైబ్రేషన్.. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయ తీరం వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న. సామ్యానుడిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మల్లన్నకు సాధించిన ఓట్లతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. యుద్ధం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దించే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చూనే వరకు విశ్రమించబోనని చెప్పారు. మల్లన్న ప్రకటనతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ ఏర్పాటుపై ఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఎమ్మెల్సీ ఫలితాల మరుసటి రోజే మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. దీంతో  బీసీ నినాదంతో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా? మంత్రి ఈటల,  తీన్మార్ మల్లన్న ఒకే జెండా కిందకు రాబోతున్నారా? కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాడబోతున్నారా అన్న ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే మల్లన్నకు సంబంధించి మరో చర్చ కూడా చక్కర్లు కొడుతోంది. మల్లన్న బీజేపీలో చేరి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మల్లన్నకు సపోర్ట్ చేసిందనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అండదండలు మల్లన్నకు ఉన్నాయన్న వాదన కొందరు చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై  స్పందించారు తీన్మార్ మల్లన్న.  తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు. తన భవిష్యత్ గమనం గురించి క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమన్నారు. ఈటలకు జరుగుతోన్న అన్యాయాన్ని గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేశారు. ఈటలను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష  ఓట్లు వేయిస్తే .. మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయాడని ప్రశ్నించారు. బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, తమ సిద్ధాంతాలు వేరని తెలిపారు. తాను కులానికి చెందిన వ్యక్తిని కాదని దయచేసి తనపై కుల ముద్ర వేయొద్దని సూచించారు తీన్మార్ మల్లన్న.  

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల డబ్బులు తనకెందుకని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. తనకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని చెప్పారు. తన  అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే.. 5కోట్లు జమ అవుతాయన్నారు. బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసస్తే లేదని మల్లన్న తేల్చి చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపుచ్చారు. 45 కేజీల సీఎం కేసీఆర్ శరీరంతో తనకు ద్వేషం లేదన్నారు. కేసీఆర్ మెదడు తీసుకునే నిర్ణయాలనే నేను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 6వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నానని చెప్పారు.  ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రచారం ఒట్టిదేనన్నారు. అసెంబ్లీ అంటే తెలియని వారిని  తనతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని తిన్మార్ మల్లన్న ప్రకటించారు.

By
en-us Political News

  
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.