ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. తొలి మ్యాచ్ లో విజయం సాధించి టీమ్ ఇండియా శుభారంభం.!
Publish Date:Jul 14, 2026
Advertisement
ఇటీవల టి20లలో వరుస పరాజయాలతో కుదేలైన టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను విజయంతో బోణీ చేసింది. ఇర్లండ్, ఇంగ్లిండ్ లతో టి20 సిరీస్ లలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైన టీమ్ ఇండియా జట్టు వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ ను విజయం సాధించి గెలుపుబాట పట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం (జులై 14) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 258 పరుగులు చేసింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను అజేయంగా 76 పరుగులు చేసిన జో రూట్ , 68 పరుగులు చేసి లియామ్ డాసన్ ఆదుకున్నారు. భారత బౌలర్లలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 4 వికెట్టు పడగొట్టాడు. అనంతరం 259 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభంలో తడబడింది. రోకో (రోహిత్, కోహ్లీ) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే స్కిప్పర్ శుభమన్ గిల్ కెప్టున్స ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా గిల్ కు మంచి సహకారాన్ని అందించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ రనౌట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. తరువాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక పరుగుకే పెవిలియన్ చేరడంతో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించి, మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. Axar Patel all round performance, Washington Sundar half century, Shubman Gill 80 runs
http://www.teluguone.com/news/content/team-india-victory-in-1st-oneday-36-226011.html





