2027 ఐపీఎల్ వరకు టీమిండియా బిజీ షెడ్యూల్

Publish Date:Jun 3, 2026

Advertisement

 

టీమిండియాకు రానున్న ఐపీఎల్ 2027 వరకూ బీసీసీఐ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ ఏడాది కాలంలో పది టెస్టులు, 20 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. విరాట్ కోహ్లి - రోహిత్ శర్మ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నారు. ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో వీరి కోసం ఎక్కువ వన్డే షెడ్యూల్‌లు కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్, జింబాబ్వే టూర్లతో పాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడనుంది. 

ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా అప్ఘనిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు మ్యాచ్‌తోనే టీమిండియా షెడ్యూల్ మొదలవుతోంది. జూన్ 6న మొహాలీ వేదికగా భారత్ - అప్ఘనిస్థాన్ టెస్టు, జూన్ 13 - 20 వరకు అప్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఐర్లాండ్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

జూలై‌లో ఇంగ్లండ్ - భారత్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ వేదికగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 1 - 11 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు, జూలై 14 - 19 వరకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, కార్డిఫ్ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే జూలై 23 - 26 వరకు జింబాబ్వే‌తో హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో భారత్ వేదికగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 27 - అక్టోబర్ 3 వరకు తిరువనంతపురం, గువాహటి, మొహాలి వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు, అక్టోబర్ 6 - 14 వరకు లక్నో, రాంచీ, ఇండోర్, కోల్‌కతా వేదికగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

జనవరిలో జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. జింబాబ్వేతో జనవరి 3 - 9 వరకు ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్, వాంఖడే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 21 - ఫిబ్రవరి 27 వరకు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికగా ఈ ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.

By
en-us Political News

  
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.