ఇంగ్లాండ్ తో రెండో టి20.. టీమ్ ఇండియా ఓటమి.!

Publish Date:Jul 4, 2026

Advertisement

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన   రెండో టీ20 మ్యాచ్ టో టీమ్ ఇండియా పరాజయాన్ని మూటకట్టుకుంది.   . హై-స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్, ఇండియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఈ సిరీస్ లో  1-0తో ముందంజ వేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే టీమిండియా స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకర ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, కెప్టెన్ జోస్ బట్లర్ లను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర కష్టాల్లో పడిన వేళ,   కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్రూక్ అవుటైన తర్వాత యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. టామ్ బాంటన్ తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన బెథెల్, ఆ తర్వాత టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతూ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5  సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెథెల్ పవర్ హిట్టింగ్ ధాటికి ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే, అంటే 19 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

 తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా   బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది.  ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా,   అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.    అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో బాధ్యతాయుతంగా రాణించాడు. ఇక ఆఖర్లో యువ ఆటగాడు తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లతో రాణించాడు. ఇంతటి భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ముఖ్యంగా జాకబ్ బెథెల్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ జులై 7న జరగనుంది.

ఇక పోతే.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులు  పేరిట ఉన్న   రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన తొలి మ్యాచ్‌లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన అద్భుతమైన సిక్సర్‌తో సహా 10 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు.

Jacob Bethell power hitting, Ind vs Eng, Vaibhav Suryavamshi, Entry

By
en-us Political News

  
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.