భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!

Publish Date:Feb 11, 2025

Advertisement

 


ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడు అయినా టిఫిన్, భోజనం చేశాక టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మంది అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీ లు తీసుకోవడం అనేది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి వచ్చినా దాని రుచి అడ్డు కట్ట వేస్తుంది. అయితే భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెబుతున్నారు ఆహార నిపుణులు, వైద్యులు.  భోజనం తరువాత కాపీ, టీ లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

ఈ కాలంలో చాలా మంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో గ్యాస్, ఉబ్బరం,   మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.  అయితే ఆహారం తీసుకోవడంలో కానీ, తప్పడు ఆహారపు అలవాట్లు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయట.  

భోజనం చేసిన తరువాత కాఫీ, టీ తాగితే..

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్,  టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి,  కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయి.  ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది,  ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు.

శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది.  దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు చాలా దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటి నొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర పట్టదు. చాలా మంది టీ తాగిన తర్వాత రాత్రి నిద్రపోలేకపోతున్నామని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వెంటనే టీని వదులుకోవడం మంచిది.

                                         *రూపశ్రీ.


గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


 

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.