ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఒంగోలు మేయర్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి నల్లమళ్ళ శ్రీశిల్ప కైవసం చేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై 37 వేల ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో తెలుగుదేశం కూటమి శ్రేణులు ఒంగోలులో సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ లో మొదటి నుంచి నల్లమళ్ళ శ్రీశిల్ప స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
అదలా ఉంటే ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం 39 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షాలు జనసేన 8 డివిజన్లలో, బీజేపీ ఒక డివిజన్లో విజయం సాధించాయి. ఇక వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్ లలో గెలుపొందారు. కాగా మురసు తుపాను కారణంగా ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. తుపాను కారణంగా మంగళవారం (నవంబర్ 3) జరగాల్సిన ఓట్ల లెక్కింపు బుధవారం (నవంబర్ 4) నిర్వహించారు.
[TDP Win Ongole Corporation, Mayor, SriSilpi, TDP Victory, Ongole Municipal Corporation, AP Local Body Elections, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-win-ongole-corporation-25-236294.html
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!