Publish Date:Apr 28, 2025
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
Publish Date:Apr 28, 2025
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటయ్యాయి. ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ.. మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య ప్రదర్శించారు.
Publish Date:Apr 28, 2025
హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన విలాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.
Publish Date:Apr 28, 2025
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం అరెస్టు చేసింది.
Publish Date:Apr 28, 2025
Hanmakonda, Elkaturthi, BRS Party, Silver Jubilee Celebration, Rahul Gandhi, Janareddy, KK, Vem Narender Reddy, Operation Kagar,KCR, KTR, Maoists
Publish Date:Apr 28, 2025
Publish Date:Apr 28, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
Publish Date:Apr 28, 2025
విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.
Publish Date:Apr 28, 2025
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది.
Publish Date:Apr 28, 2025
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
Publish Date:Apr 28, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
Publish Date:Apr 28, 2025
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే.
Publish Date:Apr 28, 2025
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది.