శ్రీకాళహస్తిలో టిడిపి పరిస్థితి ఏంటి ?
Publish Date:Oct 5, 2019
Advertisement
శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని టిడిపి క్యాడర్ కు నడిపించే నాయకుడు కరువయ్యాడు. టిడిపి సీనియర్ మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు ఇక్కడ్నించి గెలుపొందారు. తరువాత రెండు వేల తొమ్మిది, రెండు వేల పద్నాలుగు లోనూ ఆయన విజయం సాధించారు. రెండు వేల పద్నాలుగు లో ఆయన చంద్రబాబు మంత్రి వర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే అనారోగ్యం వల్ల ఎన్నికలకు ఏడాది ముందు ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలిగించారు. ఆ ఎఫెక్ట్ తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని కొడుకు సుధీర్ రెడ్డికి రాజకీయ వారసత్వం కట్టబెట్టారు. అయితే అప్పటికే బొజ్జల కుటుంబంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక సుధీర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి పార్టీ లోనూ అతని అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయిన అప్పటికీ శ్రీకాళహస్తి టికెట్ రేసులో ఉన్న టిడిపి నేత ఎస్వీవీ నాయుడుని కాదని చంద్రబాబు బొజ్జల కుటుంబానికి సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో సుధీర్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత టిడిపి అధికారంలోకి రావటం బొజ్జల గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారని తమ్ముళ్లు అంటున్నారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే పార్టీకి ఎన్నికల ముందు నుంచే చెడ్డపేరూ వచ్చింది అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. చివరకు అనుకున్నదే జరిగిన బొజ్జల తనయుడు తీరులో మాత్రం మార్పు రావడం లేదనే టాక్ నియోజక వర్గంలో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారని పార్టీని, కేడర్ ను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే శ్రీకాళహస్తి వచ్చిన సుధీర్ కొద్దిమంది నేతలతో అలా అలా మాట్లాడి వెళ్లారే తప్ప కార్యకర్తల సమస్యలను పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ, బీజేపీ గూటికి చేరి పోయారు. మిగిలిన నేతలు బిజెపి శ్రీకాళహస్తి ఇంచార్జ్ కోలా ఆనంద్ తో నిత్యం టచ్ లో ఉంటున్నారని సమాచారం. వారు రేపొమాపో కండువా మార్చటం ఖాయమనే టాక్ కూడా వినపడుతోంది. నియోజక వర్గంలోని ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి పట్టణాలకు సంబంధించిన పార్టీలోని కీలక నేతలు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీలలోకి వెళుతున్న పట్టించుకున్న వారే కరువయ్యారని తెలుగు ప్రజలు అంటున్నారు. విషయాన్ని సుధీర్ రెడ్డికి చెప్పినా ఫలితం లేకపోవటంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారనీ పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే శ్రీకాళహస్తి టిడిపి ఖాళీ అవుతుందనే అభిప్రాయాన్ని పార్టీ కార్యకర్తలే బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అధినేత చంద్రబాబు స్వయంగా ఇసుకపై ఆందోళన చేయాలని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తిలో మాత్రం వాటి జాడే కనపడలేదు. ఏదేమైనా సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న తెలుగు ప్రజలు ఇప్పటికైనా అధినేత స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-position-in-srikalahasti-25-89779.html





