గోదావరి జిల్లాల్లో సైకిల్ స్పీడ్.. బాబు పర్యటనకు జన సునామీ

Publish Date:Dec 1, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా అంటే తెలుగుదేశం శ్రేణులు సహజంగానే ఔనని అంటాయి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న జన సందోహాన్ని చూసి పరిశీలకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలోనైనా, గత రెండు రోజులుగా గోదావరి జిల్లాలలో పర్యటనకైనా జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారేమీ తరలిస్తే వచ్చిన జనం కాదు. చంద్రబాబు పర్యటన ఐదారు షెడ్యూల్ కంటే ఐదారు గంటలు ఆలస్యమైనా జనం ఓపికగా వేచి చూస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. వైసీపీపై ఆయన విమర్శలకు చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారు. గతంలో అంటే తన హయాంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ఔను నిజమే అని ఆమోదం తెలుపుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వాతావరణమే పరిశీలకులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం తధ్యమన్నఅంచనాకు వచ్చేలా చేశాయి. అన్నిటికీ మించి  గోదావరి జిల్లాల దీవెన ఏ పార్టీకి లభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. గత ఎన్నికలలో వైకాపీ అధికారంలోకి వచ్చిందంటే గోదావరి జిల్లాలలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడమే కారణం. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ  స్థానాలలో విజయం సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నది ఇప్పటి వరకూ రుజువౌతూ వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి వస్తుండటంతో వైసీపీలో కలవరం కనిపిస్తోంది. జనం చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూడటమే ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో  ఎత్తి చూపుతోంది.  ఈ పరిస్థితి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తులు, పొడుపులుపై జరిగిన చర్చ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది.

జనం తెలుగుదేశం అధినేత పర్యటనలకు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే.. రాష్ట్రం పురోగమించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అన్న నిర్ణయానికి వారు వచ్చేశారా అనిపించక మానదు. తెలుగుదేశంలో కూడా అదే ధీమా కనిపిస్తోంది.  పొత్తులతో సంబంధం లేకుండానే  అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో విజయం ఖాయమన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనం నీరాజనాలు పలుకుతుండటంతో తిరుగులేదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 2019 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు పెట్టని కోటగా ఉండేవి.

అయితే 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ పై చేయి సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 29 స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం కేవలం ఐదు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబూ అంటూ జనం బాధపడేలా చేశారని అంటున్నారు.   ఈ పరిస్థితి ఒక్క గోదావరి జిల్లాల్లోనే  కాదు రాష్ట్రమంతటా ఉందని కూడా చెబుతున్నారు. ఆఖరికి రాయలసీమలో కూడా ఈ సారి అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెబుతున్నారు. పరిశీలకులు సైతం ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్ల సునామీగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రంగంలో జనసేన వంటి పార్టీలు ఉన్నా..ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబే గట్టెక్కించగలరని ప్రజలు భావిస్తున్నారని రాజకీయవర్గాలలో సైతం చర్చ నడుస్తోంది. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.