Publish Date:Oct 13, 2018
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్ష చేసింది తెలిసిందే.తాజాగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యారు.రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఎంపీలు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎంపీలు కోరారు.కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.ఉక్కు కర్మాగారంపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని.. ఏపీకి ఏమీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారా? అని కేంద్ర మంత్రిని నిలదీసినట్లు ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు.తమ డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ఎంపీలు చెప్పారు. ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. వారం రోజుల్లో కేంద్రం తరఫున లేఖ విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇచ్చామని ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంపై పగబట్టినట్లుగా వ్యవహరించవద్దని కోరినట్లు చెప్పారు.
టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు:
*కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి.
*కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి.
*కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి.
*కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా?
*కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-mps-meet-central-minister-39-83882.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.