మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోనూ అవినీతి మయం...

Publish Date:May 3, 2020

Advertisement

జగన్ రెడ్డి అవినీతి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు  రెండు చక్రాలు లాంటి వార‌ని శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న విమ‌ర్శించారు.  జగన్ చేత‌గాని అసమర్ధత పాలన ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది.  భవిష్యత్ లో కరోనా మరింత ఉదృతం కాబోతుందని ఆయనే చెప్పారు. 

రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కరోనా జ్వరం లాంటిది, వస్తుంది, పోతుందని చిన్నపిల్లవాడిలా జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని ఆయ‌న విమ‌ర్శించారు.  కరోనాతో సహజీవనం చేయాలని ఆయన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

కరోనా మహామ్మారి ఎక్కువగా ఉందని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా అంటే ఏమీ లేదని జగన్ చెప్పడం సిగ్గుచేటు.  చంద్రబాబు నాయుడు అనేక విపత్తు సమయంలో ఏపీని ఆదుకున్నారు. ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగితుంటే జగన్ మాత్రం సిల్లీగా ఉంటున్నారు.  ప్రపంచ మేథావులు ఏం మాట్లాడుతున్నారు. అందుకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంద‌న్నారు.  

తెలంగాణలో కేసులు  తగ్గుతుంటే ఏపీలో కేసులు పెరుగుతున్నాయి.  ప్రజలకు కరోనా రావాలని జగన్ కోరుకుంటున్నారా? కరోనా పుట్టిన చైనాలోను తగ్గుముఖం పడితే ఏపీలో మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 

అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఎందుకు ఆదర్శంగాతీసుకోవడం లేదు?  ప్రాతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తామన్నారు. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు?  డాక్టర్లకు మాస్కులు లేవని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ లేదని చెప్పిన నగిరి మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు. 

5 కోట్లకు 3 మాస్కులు కావాలంటే 15 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పటి వరకు ఎవరికి, ఎక్కడ ఇచ్చారు.  కరోనాను అడ్డం పెట్టుకొని మాస్కుల రూపంలో స్కాం చేద్దామని చూస్తున్నారు.  మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం లాక్ డౌన్ ను తొలగించాలని చెప్పడం సిగ్గుచేటని ఆయ‌న విమ‌ర్శించారు.

తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతల మందు కంపెనీలను తెరిచి అమ్ముకొని ప్రజలను దోచుకునేందుకు మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తారా?  అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిప‌డ్డారు. 

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల మధ్య సరిహద్దులు ఏ మాత్రం ఉన్నాయి? కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా?  ప్రజలకు రూ.5వేలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు?  మూడు మాస్కులకు అయ్యే డబ్బులు ప్రజలకు ఇస్తే వాళ్లే మాస్కులు కొనుక్కుంటారు కదా?  

విజయసాయిరెడ్డి  వైసీపీ మందిని రోడ్ల వెంటా తిప్పుతూ ఆర్బాటంగా తిరుగుతున్నారు.  కరోనా ఈ మాత్రం అదుపులో ఉందటానికి పోలీసులే కారణం. వారికి నా సెల్యూట్ చేస్తున్నాం. కాని అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయసాయిరెడ్డి లెక్కలేని తనంగా తిరుగుతున్నారు. పరిపాలన అవగాహన లోపంలో భాగంగా ఇవ్వన్ని జరుతున్నాయి. లాక్ డౌన్ తగ్గుముఖం పట్టాల్సింది ఎందుకు పెరుగుతున్నాయి. కరోనా తగ్గించలేకపోతే వైసీపీ నేతలనైనా కంట్రోల్ లో పెట్టాలని ఎమ్మెల్సీ సూచించారు.

వైసీపీ నేతలు బ‌యట తిరుగుతున్నారు. ప్రజలు పాలనతో విసుగెత్తిపోయారు. ఆరోగ్య సర్వే జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారు.  ఇదంతా అవాస్తవం. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? జగన్ ఇప్పటికైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. 

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఇటలీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆయన దాని గురించి మాట్లాడరు. ఇష్టానుసారంగా మాట్లాడే అనీల్ కుమార్ యాదవ్ కు కూడా నెల్లూరు లో కరోనా కేసులు కంట్రోల్ చేయడం చేతగాక చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు.

విజయసాయిరెడ్డి, బుగ్గన ఇద్దరూ జగన్ అవినీతి బండికి రెండు చక్రాలు. ఎప్పటికైనా రెండు టైర్లు పంచర్ అవ్వడం ఖాయం.  వైన్ షాపులు ప్రభుత్వం తెరవటం విరమించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు.  చంద్రబాబు నాయుడు పాలన చూశాం కాబట్టి జగన్ పాలన ఒక సారి చూద్దామని ప్రజలు భావించారు. పరిపాలన ఇచ్చారని ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజలు విప్లవం ద్వారా గద్దె దింపుతారని బుద్ధా వెంకన్న అన్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.