ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టన ఈ ఏడాది కాలంలో ఏపీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టోంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్నిల్ నియామకాలు, పని తీరుపై పార్టీ లీగల్ సెల్ పలు అంశాలపై ఇంటర్నల్ నోట్ పంపింది. ప్రస్తుతం అధిఅధికార టీడీపీ లీగల్ సెల్ న్యాయ అధికారుల పనితీరు మరియు పనితీరుపై పంపిన 76 పేజీల అంతర్గతనోట్ లో పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో మాజీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై మైనింగ్ కేసులో ప్రభుత్వం తరపున వాదించడానికి జూనియర్ న్యాయవాదిని నియమించి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడమే కాకుండా బెయిలు మంజూరు చేయడానికి దోహదం చేసిందని ఆరోపించింది.
అదే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నిందితుల తరఫున పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారనీ, ఆయన ప్రభుత్వ వాదనను పూర్వపక్షం చేస్తూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని వాదించారీ టీడీపీ లీగల్ సెల్ ఆ ఇంటర్నల్ నోట్ లో పేర్కొంది.
ఇక పోతే గత జగన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఏడుగురు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులు, అలాగే 23 మంది స్టాండింగ్ కౌన్సిల్లే ఇంకా అలాగే కొనాసగుతున్నారని పేర్కొంది. అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి ఏడాది కాలం పూర్తియిన తరువాత కూడా పది మంది ప్రభుత్వ న్యాయవాదు, 60 స్టాండింగ్ కౌన్సెల్ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయని పేర్కొంది.
అలాగే జగన్ హయాంలో తెలుగుదేశం తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు సముచిత పదవుల కోసం ఎదురు చూస్తున్నా, ఖాళీల భర్తీ విషయంలో ఏజీ చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద ప్రభుత్వానికి ఏజీ లక్ష్యంగా తెలుగుదేశం లీగల్ సెల్ ఇంటర్నల్ నోట్ పంపడం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-legal-cell-internal-note-to-cbn-39-201439.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.