వీఐపీ జోన్ లోనే పట్టాభిపై దాడి! మంత్రి కొడాలి హస్తం ఉందన్న టీడీపీ

Publish Date:Feb 2, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో బీహార్ ను తలదన్నేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అటు నిమ్మాడలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు జరగగా.. ఇటు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది.  ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ధ్వసమైంది. మంత్రులు, హైకోర్టులు జడ్జ్‌లు, ప్రముఖులు ఉండే ప్రాంతంలోనే పట్టాభి ఉంటారు. వీఐపీ జోన్ లోనే మారుణాయుధాలతో దాడి చేశారంటే... ఏపీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో  ఊహించవచ్చు.   

ఉదయం కార్యాలయానికి  వెళుతున్న సమయంలో  దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో తనపై దాడి  చేశారని పట్టాభి తెలిపారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు చెప్పారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని పట్టాభి గుర్తుచేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదని, వాస్తవాలను బయటపెట్టేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయి పట్టాభి. తనకు రక్షణ కల్పించాలని కోరినా  పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 

తనపై జరిగిన దాడి వెనుక మంత్రి కొడాలి నాని పాత్ర ఉందని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీని అణచివేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పధకం ప్రకారమే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పోలీస్‌ కమిషనర్ లేదా డీజీపీ వచ్చి  దాడిపై సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని  స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు.. సీఎం జగన్ అని పట్టాభి తెలిపారు.పట్టాభిపై దుండగులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని పట్టాభిని పరామర్శించారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయిందని,ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.