జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కలే

Publish Date:Oct 1, 2020

Advertisement

వైసీపీ విధానాలతో అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్ర 3 వ స్థానం

 

వైసీపీ ప్రభుత్వం తీరుపై అమలాపురం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతకుమారి ధ్వజం

 

వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆచరణలో ఆ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని లెక్కలు చెబుతూ వారికి ఆచరణలో  మొండిచెయ్యి చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి వెన్నుముక అని చెప్పబడుతున్న రైతుకు ఈ  ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ లో పంట ఉత్పత్తులు కొనేవారు లేక అయిన కాడికి అమ్ముకునే దుస్థితి తీసుకువచ్చారని, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆందోళన వెలుబుచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందించడంలో  విఫలం అయ్యారని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో ఇటీవల వరదలు, భారీ వర్షాలకు పంటలు నష్ట పోయినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. జగన్ వచ్చిన తర్వాత అతివృష్టి అనా వృష్టి తో  అన్నదాతలకు అన్ని కష్టాలే మిగిలాయని ఆందోళన వెలుబుచ్చారు. 

 

ఈ పాలనలో ఏ పంటకు మద్దతు ధర లభించలేదని ధాన్యం, పసుపు, మొక్కజొన్న,కంది, శనగ పంట సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రైతులకు రూ.1,728 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు.గతంలో 22 వేలు  ఉన్న మిర్చి ధర 8 వేలకు పడిపోయిందని ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి 1815 ఉండగా రూ.1100 నుంచి 1300 కు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.క్వింటా ధాన్యానికి రైతు 500 నుంచి 700 వరకు నష్టపోయాడని మొక్కజొన్నకు మద్దతు ధర 1760 ఉండగా 1400 కు కొనుగోలు చేశారని వేరుశనగ రూ.5090 ఉండగా రూ.4500 మినుములు 5700 ఉండగా 5000  కొనుగోలు చేశారని తెలిపారు. 

 

జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలతో దేశంలోనే రాష్ట్రం 3 వ స్థానం లో ఉందని, 2018 లో 664 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా  జగన్ అధికారం చేపట్టాక 2019లో  1029 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది  ఇప్పటి వరకు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.బడ్జెట్లో 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింప చేస్తామని చెప్పి 45,00,263 మందికి కుదించారన్నారు.15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారని ఇది నమ్మక ద్రోహం కాదా? అని ప్రశ్నించారు.సున్నా వడ్డీకి  రైతురుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పారని, 4వేల కోట్లు ఇస్తామని చెప్పి 2019 బడ్జెట్ లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.ఇప్పుడు ఉచిత  వ్యవసాయ విద్యుత్ అని చెబుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.రేపు వచ్చే బిల్లులతో వారి నెత్తిన భారం మోపడానికి జరుగుతున్న ఎత్తుగడగా అభివర్ణించారు.

 

టీడీపి హయాంలో వ్యవసాయ రంగ ప్రగతి సాధించిదని ఆమె తెలిపారు.
వ్యవసాయానికి బడ్జెట్ టిడిపి ప్రభుత్వం మూడు నాలుగు రెట్లు చేసిందని 2013-14 లో వ్యవసాయానికి బడ్జెట్ 6,128 కోట్లు కాగా టిడిపి ప్రభుత్వం  2018-19 నాటికి రూపాయలు 19,070  కోట్లకు పెంచిందని ప్రకటనలో పేర్కొన్నారు.ఐదేళ్లలో రూపాయలు 81,554 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని రైతులకు రూ. 15,279 కోట్ల మేర రుణ మాఫీ చేశామని వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సగటున 11%  సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు నిలబెట్టారని అనంతకుమారి ప్రకటనలో తెలిపారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.