కూటమి ఏడాది పాలన భేష్.. కొందరు ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి!?

Publish Date:Jun 14, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది.  అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొందరి పని తీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే.  

అలాగే కొందరు మంత్రులు కూడా ప్రజలలో మమేకం అవ్వడం లేదనీ, పూర్తిగా కార్యాలయాలకే పరిమితమౌతున్నారనీ చంద్రబాబు పేర్కొన్నారు. జనాభిప్రాయం కూడా ఇలాగే ఉంది.  కొందరు జనాలకు దూరంగా ఉంటున్నారనీ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరైతే ఇసుక, మైనింగ్ వ్యవహారాలలో పూర్తిగా తలమునకలై ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  వందలాది లారీల ఇసుక తరలి పోతోందని ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పిఠాపురం వర్మ ఇటీవల ఒకింత అసహనం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.  గత వైసీపీ హయాంలో ఎవరైతే ఈ దందాలో కీలకంగా ఉన్నారో.. వారే ఇప్పుడు యథేచ్ఛగా ఈ దందాను నడిపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకువెడతానని చెప్పారు. 

అయితే మొత్తం మీద ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో సానుకూలత ఉన్నా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పట్ల మాత్రం ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. తాన సేకరించిన సమాచారం మేరకు కొందరి తీరు బాగా లేదనీ, వారిలో మార్పు రాని పక్షంలో చర్యలు తప్పవనీ కుండబద్దలు కొట్టారు.  చంద్రబాబు వ్యాఖ్యలు, హెచ్చరికల తరువాత రాష్ట్రంలో కూటమి పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు పై చర్చ మొదలైంది.  ఏడాది కాలంలోనే కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి పీక్స్ కు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇలా ఆరోపనలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తొలి సారి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వీరిపై ప్రధాన ఆరోపణ   ప్రజలకు అందుబాటులో  ఉండటం లేదు అన్నది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి వారిని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు చెబు తున్నారు.   

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.