గోరంట్లా.. ఉచ్ఛ నీచాలు మరిచావు.. తెలుగుదేశం ఫైర్

Publish Date:Aug 4, 2022

Advertisement

రాజ‌కీయ నాయ‌కునిగా, వైసీపీ ఎంపీగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకోవాల్సిన గోరంట్ల మాధ‌వ్ ఊహించ‌ని విధంగా చాలా అస‌భ్య‌క‌రంగా దొరికిపోయారు. ఒక మ‌హిళ‌తో మాధ‌వ్ న్యూడ్ వీడియోకాల్ మాట్లాడుతూ న్న క్లిప్పింగ్ ఒకటి  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. వీడియో లీక్ కావడంతో వెంటనే మాధవ్‌పై సీఎం జగన్ చర్య లు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించా లని డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారి నని చెప్పుకుని.. ఆ ప్రచారంతోనే మాధవ్ ఎంపీగా గెలిచారని, కానీ సీఐగా కూడా గోరంట్ల మాధవ్ పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఎంపీగా కూడా ఆయన తీరు, వైఖరీ మారలేదనడానికి తాజీ వీడియోనే సాక్ష్యమని దుయ్యబడుతున్నారు.

కాగ   నెటిజ‌న్లు,యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ఆయ‌న తీరుపై మండిప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో మాధ‌వ్ సీఐగా ప‌నిచేస్తున్న‌రోజుల్లో కూడా ఒక మ‌హిళ‌తో ఇదే విధంగా మాట్లాడార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తిం చ డంపై మహిళా సంఘాలు మండిపడుతు న్నా యి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన  ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు.  కాగా, ఆయన మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. 

 వైసీపీ నేతల  తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ  నేత బోండా ఉమా  అన్నారు. మీడి యాతో మాట్లాడుతూ, సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. అడ్డంగా దొరి కినా ఇంకా గోరంట్ల మాధవ్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్‌ చేయాలని అన్నారు. ఎంపీ గోరంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేశ్‌ మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నారని బొండా ఉమ బోండా ఉమా ఆరోపించారు. అలాగే అంబటి రాంబాబు విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అసలు వైసీపీ నేతలెవరికీ మహిళల పట్ల గౌరవం లేదని విమర్శించారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుం టోందని టీడీపీ నేత, మాజీమంత్రి పీతల సుజాత  అన్నారు. ఎంపీ గోరంట్ల ఓ మహిళతో మాట్లాడిన న్యూడ్ వీడియో  కాల్‌పై స్పందించిన ఆమె  మీడియాతో మాట్లాడుతూ వీడియో కాల్‌కు.. జిమ్‌లో వీడియోకు తేడా తెలియదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.  మహిళల పట్ల అసభ్యంగా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌పై సీఎం జగన్ నాడు చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ విధంగా చేసేవారా? అని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ మహిళా సత్తా ఏంటో చూపిస్తామని పీతల సుజాత అన్నారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.