వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఒక తంటా.. లేకుంటే మరో మంట!?

Publish Date:Mar 9, 2025

Advertisement

పిఠాపురంలో,  జనసేన, తెలుగుదేశం మధ్య   ఏం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే  ఎస్ విఎస్ఎస్ వర్మకు  టిడిపి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ వస్తుందా?  లేదా!  వర్మకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకునే శక్తి పిఠాపురంలో ఎవరికి ఉంది ...ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని చెబుతున్న జనసేన మాటలకు అర్ధమేంటి? వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎలా ఉంటాయి? ఇవ్వక పోతే ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

పిఠాపురం నియోజకవర్గంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన నాయకుడు వర్మ. ఎంత కీలకమైన నాయకుడు అంటే ,వర్మకు తెలుగుదేశం  సీటు ఇవ్వకపోయినా.. 2014లో ఇండిపెండెంట్ గా  పోటీ చేసి, 47 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదేంటి ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేస్తారు , ఎవరైనా గెలుస్తారు కదా అని అనుకుం టున్నారా? అది  కాదు విషయం..  వర్మది  ప్రత్యేకమైన శైలి. నియోజకవర్గంలో ప్రతి ఇంటి మనిషిగా వర్మకు గుర్తింపు ఉంది.  2014లో తెలుగుదేశం, బిజెపి  కలిసి పోటీ చేసిన సమయంలో, ఈ రెండు పార్టీలకూ జనసేన కూడా మద్దతు ఇచ్చిన ఆ సమయంలో కూడా వర్మ  ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.అంటే నియోజకవర్గంలో వర్మకు ఉన్న పట్టు, బలానికి అది నిదర్శనం. అటువంటి వర్మను 2024 ఎన్నికల్లో  పవర్ స్టార్ పవన్  సైతం  తనకు బలంగా, అండగా భావించి పక్కన పెట్టుకున్నారు.  అదీ పిఠాపురంలో వర్మకు ఉన్న పలుకుబడి, పట్టు. గుర్తింపు.  

మరి అదే పిఠాపురంలో , అదే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో, ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్  ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం గా , జనసేనకు అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్,  వర్మకు ఇచ్చే ఎమ్మెల్సీకి ఎందుకు అడ్డుపడతారు? అన్న  సందేహం రావచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు చేస్తున్న ప్రచారం ఏంటంటే,  వర్మది మరీ ముక్కుసూటి తనం, తాను అనుకున్నదిఅనుకున్నట్లు చెప్పేస్తారు, చేసేస్తారు.  రాజీ పడాల్సిన చోట కూడా పోరాటం చేస్తారు.   సర్దుకు పోయే మనస్తత్వం ఇసుమంతైనా లేని వర్మకు అవకాశం ఇస్తే.. అది ఇరు పార్టీల మధ్య అగాధం ఏర్పడటానికీ, విభేదాలు పొడసూపటానికి కారణం అవుతుందన్నది జనసేన నేతల అభిప్రాయం.   పవన్ కళ్యాణ్ ను  మనమే గెలిపించాం, పార్టీ  లైన్ దాటడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికాను, అంటూ    మన పార్టీ, మన నియోజకవర్గం, అనే నినాదం తో వర్మ పనిచేస్తున్నట్లు పిఠాపురంలో పెద్ద ఎత్తున  ప్రచారం జరుగుతున్నది. వర్మ నోటి నుండి అలాంటి దురుసు మాటలు,  బయట పడుతున్న ఆలోచనలే, వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ను దూరం చేస్తున్నాయా? అన్న సందేహాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. 

.వాస్తవానికి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ కు ఎక్కడ నెగ్గాలో,  ,ఎక్కడ తగ్గాలో తెలియదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కష్ట కాలంలో తన పోరాటాలతో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి, రాష్ట్రంలో కూటమి భాగస్వామిగా తెలుగుదేశం పార్టీని గెలిపించిన పార్టీగా జనసేనకు పేరు ఉంది.  మరి ఈ పరిస్థితుల్లో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారా?    పవన్ కళ్యాణ్, వర్మలు ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే ఏం జరుగుతుంది? అన్న చర్చ ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం వర్గాలలో జరుగుతోంది.  డిప్యూటీ సీఎం హోదా లో ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో పెద్దగా ఉండరు. .రాష్ట్రవ్యాప్తంగా పర్యటన లు  చేస్తుంటారు. పార్టీ నిర్మాణం, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కారణంగా పవన్ కళ్యాణ్   బిజీగా ఉంటారు. అదే సమయంలో స్థానికంగా ఉండే వర్మ  ప్రతి ఇంటి మనిషిగా నిలబడిపోతారు.  మరి రాబోయే ఎన్నికల్లో ఇదే పరిస్థితి ,ఇదే ప్రశ్న ఉత్పన్నమైతే అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు, వర్మ మరోసారి  అడ్డు  అవుతారన్న భయం, అనుమానం జనసైనికుల్లో వ్యక్తం అవుతోంది. అదే జరిగితే   పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందికర పరిస్థితి  వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కు సమాంతరంగా వర్మను రెండో శక్తిగా నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయడం జనసేనకు ఇష్టం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో  వర్మకి ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఒకతంటా, ఇవ్వకపోతే మంట అన్నట్లుగా పరిస్థితి తయారైందంటున్నారు.  

ఎందుకంటే ఎమ్మెల్సీ సీటు వర్మకి ఇస్తే ,నియోజకవర్గంలో పవన్ కు సమాంతరంగా వర్మ పలుకుబడి పెరుగుతుంది.  వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోతే  తెలుగుదేశం, జనసేనల మధ్య అగాధం పెరుగుతుంది. అలా కాకుండా ఎమ్మెల్సీగా వర్మకు టికెట్ ఇస్తే..  ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం   ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోతే ,పెత్తనం అంతా ఎమ్మెల్సీ వెళుతుంది.   ప్రోటోకాల్ ప్రకారం ప్రతి నాయకుడు ,ప్రతి అధికారి వచ్చి వర్మనే కలిసే పరిస్థితి ఉంటుంది   వర్మ దానిని తనకు అనుకూలంగా,  బలంగా మార్చుకుంటారు. దీంతో వర్మ రానున్న రోజుల్లో మరింత  ప్రమాదం గా కూడా మారే అవకాశం ఉంది.   ఒకవేళ ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వ వద్దని,  పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేస్తే, అది కూడా పిఠాపురంలో ,రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికపై ప్రభావం చూపిస్తుంది.  అలా అని పవన్ కళ్యాణ్ ను కాదని, వర్మకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తే, అది టిడిపి జనసేన ల మధ్య , రాష్ట్రవ్యాప్తంగా, ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. 

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.