ఐదు రోజులైనా సీఎం ఏం గడ్డి పీకారు!
Publish Date:Jan 5, 2021
Advertisement
ఆలయాలపై దాడులు , పోలీసుల తీరు, సర్కార్ నిర్లక్ష్యంపై మరోసారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మతమార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు. హిందూ-ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి మాపై నిందలు వేస్తోందని, ఘటన జరిగి 5 రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డి పీకారని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థం ఘటన అమానుషమన్న చంద్రబాబు.. మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన..దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపరా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదన్నారు చంద్రబాబు. రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని మండిపడ్డారు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో మతమార్పిడులు చేయించడానికి వీళ్లేదన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ గుర్తించాలన్నారు చంద్రబాబు. పాస్టర్లకు రూ.5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టమని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు
http://www.teluguone.com/news/content/tdp-chief-chandrababu-fire-on-cm-jagan-on-rama-teertham-39-108544.html





