కొండపల్లిలో కేశినేని+దేవినేని.. తాడిపత్రిలో జేసీ.. ముగ్గురు మొనగాళ్లు..
Publish Date:Nov 24, 2021
Advertisement
అప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ. ఇప్పుడు కొండపల్లి మున్సిపాలిటీ. అధికార పార్టీ అహంకారానికి గొడ్డలి పెట్టు. రాజ్యం కోరలు కట్ చేసిన ఫలితాలు. పవర్లో ఉన్నామనే పంతంతో ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేయబోయారు. టీడీపీ శ్రేణులు ప్రాణాలొడ్డి మరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. అరాచకాలకు, అక్రమాలకు ధీటుగా ఎదురొడ్డి.. ఎదురుదాడి చేసి.. తాడిపత్రిపై, కొండపల్లిపై టీడీపీ జెండా రెపరెపలాడించారు. దటీజ్ టీడీపీ అనిపించారు. కొండపల్లిలో ఎంత డ్రామా చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ప్రజాతీర్పు క్లియర్ కట్‌గా ఉన్నా.. టీడీపీకే మెజార్టీ కట్టబెట్టినా.. అధికారాన్ని బలవంతంగా లాగేసుకోవాలని చూశారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంటగలపాలని కుట్రలు చేశారు. కానీ, అది కొండపల్లి. అక్కడ పాలకుల పప్పులు అసలేమాత్రం ఉడకలేదు. కౌంటింగ్ ముగియగానే.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా రంగంలోకి దిగారు. వైసీపీ కుట్రలను ముందే గుర్తించారు. గెలిచిన వారిని గెలిచినట్టు క్యాంపునకు తరలించారు. ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిస్తే.. ఆమెనే నేరుగా చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి పార్టీలో చేర్పించుకున్నారు. అలా దేవినేని చాణక్యంతో టీడీపీ-వైసీపీ బలం 15-15తో సమానం చేశారు. దేవినేని దెబ్బకు వైసీపీ అబ్బా అంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇలా, ఇప్పటిదాకా దేవినేని చూసుకున్నారు.. ఇక కేశినేని చక్రం తిప్పే వంతు వచ్చింది. అయినా, పట్టువదలలేదు అధికార పార్టీ. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను రెండు సార్లు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీ కేశినేని నానికి ఓటు హక్కు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారు. అధికారం వారి చేతిలో ఉన్నా.. న్యాయం మాత్రం టీడీపీ తరఫునే ఉంది. అందుకే వెంటనే హైకోర్టును ఆశ్రయించారు కేశినేని. కోర్టు ఆదేశాలతో ఓటు హక్కు దక్కించుకున్నారు. వైసీపీకి మళ్లీ షాక్. ఇక ఓటమి తప్పదనుకున్నారు.. సమావేశంలో కుర్చీలు విరగొట్టి ఎన్నికను అడ్డుకున్నారు. మళ్లీ టీడీపీ హైకోర్టుకు వెళ్లడం.. 24 గంటల్లో ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించడం.. పోలీస్ బలగాల భద్రతతో.. టీడీపీ కౌన్సిలర్లు, ఎంపీ కేశినేని నాని.. దర్జాగా, రాజాలా ఓటు వేయడం.. కొండపల్లి ఖిల్లా టీడీపీ కైవసం చేసుకోవడం.. అంతా వైసీపీకి దారుణ పరాభవం. టీడీపీకి ఘన విజయం. అందుకే ఇప్పుడు కొండపల్లిలో తెలుగు తమ్ముల్లు మొనగాళ్లలా, పోటుగాళ్లలా సంబరాలు చేసుకుంటున్నారు. సేమ్ టూ సేమ్.. కొన్ని నెలల క్రితం తాడిపత్రిలోనూ ఇలాంటి సీనే. కొండపల్లిలో దేవినేని, కేశినేని చక్రం తిప్పితే.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మీసం మెలేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, వైసీపీ బ్యాచ్‌కి ఝలక్ ఇస్తూ.. తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ కుర్చీలో దర్జాగా కూర్చున్నారు జేసీ. తాడిపత్రిని.. టీడీపీ అడ్డాగా మార్చారు. అయితే, ఆ విజయం సైతం అంత ఈజీగా దక్కలేదు. గెలిచిన టీడీపీ సభ్యులను వైసీపీలోకి లాక్కోవడానికి అధికార పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. డే వన్ నుంచే జేసీ.. టీడీపీ సభ్యులతో క్యాంప్ ఏర్పాటు చేసి వైసీపీకి మొదట్లోనే షాక్ ఇచ్చారు. టీడీపీ మెంబర్స్ ఆస్తులపై దాడులు, కుటుంబ సభ్యులకు బెదిరింపులతో వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా, వారు అదరలేదు..బెదరలేదు. జేసీ అండతో టీడీపీ వారంతా ఒక్క తాటిపై ఉన్నారు. తాడిపత్రిని తెలుగుదేశానికి కట్టబెట్టారు. చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. అప్పుడు తాడిపత్రి.. ఇప్పుడు కొండపల్లి.. అప్పుడు జేసీ.. ఇప్పుడు దేవినేని+కేశినేని. టీడీపీ పనైపోయిందంటూ ప్రచారం చేస్తున్న వైసీపీ మూకలకు ఈ విజయాలు గట్టి గుణపాఠాలు. అనూహ్యంగా దర్శి పీఠం సైతం టీడీపీనే కైవసం చేసుకోవడం వైసీపీ పతనం ప్రారంభమైందనేందుకు నిదర్శనం.
http://www.teluguone.com/news/content/tdp-boost-with-kondapalli-and-tadipatri-39-127017.html





