ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం ప్రకటించింది. ముందు నుంచీ అనుకుంటున్న విధంగానే పిఠాపురం వర్మకు చాన్స్ ఇవ్వలేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే ఒక స్థానానికి జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానానికి ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు. అయితే ఆ ఐదో స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను పార్టీ ఆదివారం (మార్చి 9) అధికారికంగా ప్రకటించింది.
సామాజిక వర్గాల వారీగా ముగ్గురికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడులను తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీరిలో కావలి గ్రీష్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-announce-candidates-for-mla-quota-mlc-elections-25-194115.html
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.
Publish Date:Sep 30, 2026
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
Publish Date:Sep 30, 2026
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.