టీడీపీ కోసం మనసారా పనిచేస్తాం జూ.ఎన్టీఆర్
Publish Date:Jan 17, 2012
Advertisement
హైదరాబాద్: టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, దివంగత నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ పదహారవ వర్ధంతి కావడంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడిగా పుట్టడం తన అదృష్టమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆయన మనవడిగా ఆయన స్థాపించిన పార్టీ కోసం మనసారా పని చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పారు. ఆయనలా పేదల కోసం పని చేసిన వారెవరు లేరన్నారు. కాగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
http://www.teluguone.com/news/content/tdp-24-10990.html





