మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంతు ఎప్పుడో?

Publish Date:Nov 14, 2024

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ తమకంటే తోపెవడూ లేడన్నట్లుగా చెలరేగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు మౌనం దాల్చారు. అంతే కాకుండా కలికానిక్కూడా దొరక్కుండా అజ్ణాతంలోకి పారిపోయి కలుగుల్లో దూరిపోయారు. అలాంటి నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నోటికొచ్చినట్లు మాట్లాడటంలో ఈయన కొడాలి నాని తరువాతి స్థానంలో ఉంటారని కచ్చితంగా చెప్పొచ్చు.  ఇటీవలి ఎన్నికలలో పార్టీతో పాటు తాను కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఓటమిని అంగీకరించేశారు. పోలింగ్ తరువాత మీడియా ముందు ఎన్నికలలో పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు గుప్పించారు. అంతే  ఆ తరువాత సైలెంటైపోయారు. ఓటమికి సాకులు చెప్పడం కూడా మానేశారు. చేతులెత్తేశారు. ముఖం చాటేశారు.  

ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. దీంతో  వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన నేతలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న నాయకులు ఇప్పుడు  అజ్ణాతంలోకి  జారుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే చేశారు. 

 కానీ   వైసీపీ అధికారంలో ఉండగా, తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో  అనిల్ కుమార్ యాదవ్  నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు  విసిరారు. అలాంటి అనిల్ కుమార్ ఇప్పుడు ముఖం చాటేశారు.  అనిల్ కుమార్ దోపిడీ, అక్రమాలపై  తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే జ్యుడీషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేసింది. 

పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో, మీడియాలో ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఒక్కొక్కరినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చట్టం ముందు నిలబెడుతోంది.    వైసీపీ మార్క్ అరాచకానికి, చిల్లర పనులకు బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొంది, అసెంబ్లీలో తొడలు కొట్టడం, జిప్పులు తీయడం వంటి నీచ నికృష్ఠ పనులకు పాల్పడిన అనిల్ కుమార్ ను ఎలా వదులుతాం అంటూ తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. అయితే అధికారంలో ఉన్న సమయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ హద్దులు లేకండా రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్., వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత అడ్రస్ కూడా తెలియకుండా మాయమైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మీడియా ముందుకు అసలే రావడం లేదు. అసలు వైసీపీయే అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఉన్నాడని మరిచిపోయిన పరిస్థితి. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేసిన దుర్మార్గాలు, చేసిన అసభ్య, అసహ్యకర వ్యాఖ్యలు, దూషణలను తెలుగుదేశం శ్రేణులు మరిచిపోలేదు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్నారు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.