టీసీఎస్ నాసిక్ కేసు.. మహిళా పోలీసుల ఆపరేషన్ లో బయటపడిన కార్పొరేట్ చీకటి కోణం
Publish Date:Apr 17, 2026
Advertisement
నాషిక్ లోని టీసీఎస్ యూనిట్లో జరిగిన ఈ కేసు, భారత కార్పొరేట్ రంగానికి ఒక గంభీర హెచ్చరికగా మారింది.- యువ మహిళా ఉద్యోగులపై లైంగిక దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, మలేషియా వరకు వెళ్లే హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనుమానాలు, టెరర్ ఫండింగ్, విదేశీ సంస్థల లింకులుపై కేంద్ర సంస్థల దర్యాప్తు అన్నీ కలిసిన బహుళస్థాయి కేసు ఇది. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు ్ర నాషిక్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న కేసులు. టీసీఎస్ లో ఉద్యోగుల్లా చేరిన మహిళా పోలీసులు. సుమారు ఏడెనిమిది మంది మహిళా పోలీసులు టీసీఎస్ నాసిక్ యూటిన్ లో ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా చేరారు. దాదాపు రెండు మూరు వారాలు.. కొన్ని నివేదిక ప్రకారమైతే 40 రోజులు అక్కడ పని చేసి వర్క్ ప్లేస్ బిహేవియర్ ను నేరుగా గమనించారు. పరిశీలించారు. గూమింగ్, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ సేకరించారు. ఇది సాధారణ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణ కాదు. పూర్తిగా ప్రణాళికా బద్ధంగా జరిగిన అండర్ కవర్ ఆపరేషన్. ఎఫ్ఐఆర్ లు, కేసులు అండర్ కవర్ టీమ్ నివేదిక ఇచ్చిన తర్వాత మొదటి ఎఫ్ఐఆర్ మార్చి 25న నమోదు అయింది. ఆ తరువాత బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి మరింత మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు. ఇప్పటివరకు లైంగిక దాడులకు సంబంధించి 9 ఎఫ్ఐఆర్ లు, మత మార్పిడి ఆరోపణలపై 2ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇంకా 3 నుంచి 4 FIRలు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే మొదట భయంతో మౌనంగా ఉన్న మరికొన్ని మహిళలు ఇప్పుడు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇది కేవలంఒకటి రెండు సంఘటనలకు మాత్రమే కాదు.. ఒక ప్యాటర్ గా కనిపిస్తున్న కేసుల సిరీస్. మోడస్ ఆపరండి గూమింగ్, మతం పేరుతో బ్రెయిన్ వాష్.. ఆ తర్వాత లైంగిక దుర్వినియోగం. నివేదికలు, డిబేట్ లలో చ్చిన వివరాల ప్రకారం ఇమ్రాన్ అనే ప్రీచర్ వీడియో కాల్స్ ద్వారా కనిపిస్తూ, యువతులతో మాట్లాడి.. వాగ్దానాలు, మతపరమైన మాటలతో బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణ. స్థానికంగాహైచ్ ఆర్, టీమ్ లీడ్ స్థాయిలో ఉన్న కొందరు చిన్న పట్టణాల నుంచి వచ్చిన, అలాగే మొదటి సారి ఉద్యోగంలోకి వచ్చిన యువ హిందూ మహిళలను టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదట గైడెన్స్, సపోర్ట్, స్పిరిచువల్ కనెక్షన్ పేరుతో దగ్గరై, తర్వాత సైకాలజికల్ ప్రెషర్, గూమింగ్ , లైంగిక దుర్వినియోగం దిశగా వెళ్లినట్లు పోలీసులు, ప్యానెలిస్టులు చెబుతున్నారు. ఇది ఒకే వ్యక్తి చేసిన నేరంలా కనిపించడం లేదనీ, ఒక క్లస్టర్, ఒక నెట్వర్క్, ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ లా కనిపిస్తోందంటున్నారు. మలేషియా ట్రాఫికింగ్ అనుమానం, టెరర్ ఫండింగ్ దర్యాప్తు కొన్ని నివేదికల ప్రకారం బాధితులను మలేషియాకు తరలించే ప్రణాళికలు ఉన్నాయి. బాహ్య సంస్థలు , ఓవర్సీస్ నెట్వర్క లతో లింకులపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే టెరర్ ఫండింగ్ కోణం కూడా పరిశీలనలో ఉందని సమాచారం. కేంద్ర సంస్థలు ఈ కేసును సాధారణ కార్యాలయ లైంగిక వేధింపుల కేసుగా కాకుండా.. సంభావ్య ఆర్గనైజ్డ్ నెట్వర్క్ గా చూస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైన విషయమనీ, కార్పొరేట్, రాజకీయ బాధ్యత అనీ, దేశానికి అసలేం జరిగింది, జరుగుతోంది అని తెలుసుకునే హక్కు ఉందనీ డిబేట్లలో గట్టిగా చెబుతున్నారు. ఇది టీసీఎస్, టాటా గ్రూప్ లాంటి కంపెనీలో జరిగిందంటే.. టాప్ లీడర్షిప్ పూర్తి వివరాలతో దేశానికి సమాధానం చెప్పాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో చిన్న చిన్న ప్రకటనలు సరిపోవని అంటున్నారు. ఇక పోతే 2022 నుంచే ఫిర్యాదులు ఉన్నాయనీ, అప్పటి ప్రభుత్వాల అపీజ్మెంట్ వల్ల సీరియస్ గా తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సిట్ లు, మహిళా కానిస్టేబుళ్లు, కొత్త సిస్టమ్ లతో ఇలాంటి కేసులను బయటకు తీసుకువస్తోందన్న వాదన కూడా ఉంది. అంటే.. ఈ కేసు ఇప్పుడు కార్పొరేట్ బాధ్యత, రాజకీయ బాధ్యతలను గుర్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన డిబేట్ లో స్పష్టంగా హిందూ మహిళలను టార్గెట్ చేశారు. మత మార్పిడి ప్రయత్నం చేశారు. అన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే కొందరు దీనిని మతప్రేరేపిత నేరం అంటూ నేరుగా ఆరోపిస్తున్నారు. మరి కొందరైతే స్పష్టంగా ఇస్లాంలో మతమార్పిడి హరామ్ అంటూ.. అటువంటి కన్వర్షన్ లు చెల్లవని కుండబద్దలు కొట్టారు. అయితే.. “ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని బహిరంగంగా ఎందుకు ఖండించడంలోదు, అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వంటి సంస్థలు ఎందుకు స్పందించడంలేదన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహిళల హక్కులు, మిసోజినీ, విక్టిమ్ బ్లేమింగ్. టీవీ డిబేట్లలో కూడా పురుషులు మహిళల మాటలు కట్ చేయడం, మాట్లాడనీయకపోవడం జరిగిందనీ, అదే మైండ్ సెట్ కార్యాలయాల్లో కూడా కనిపిస్తోందనీ అంటున్నారు. మె ఎందుకు నమ్మింది?”, “ఎందుకు వెళ్లింది?” వంటి ప్రశ్నలు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విమర్శలను ఖండిస్తూ, అటువంటి తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గూమింగ్, మానసిక ఒత్తిడి, మోసం వంటి క్లిష్టమైన నేరాలను ఆమె తప్పు గా మార్చేప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. మొత్తంగా ఈ కేసులో నిజమైన హీరోయిక్ పాత్ర ఎవరిదైనా ఉందంటే అది నాసిక్ మహిళా పోలీసులదే. అండర్ వర్క్ గా వెళ్లి, పని ప్రదేశంలో కూర్చుని, గూమింగ్, లైంగిక వేధింపు ప్యాటర్న్ ను గమనించి, ఆధారాలు సేకరించి, ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్థాయికి తీసుకువచ్చింది వారే. వీరు ఈ ధైర్యం చేయకపోతే.. ఈ కేసు ఒక వదంతిగానే మిగిలిపోయేది. బాధితులు మౌనంగానే ఉండిపోయే పరిస్థితి ఉండేది. కార్పొరేట్ లోపాలు బయటకు రాకపోయేవి సేకరణ, సంకలనం : సీతారాం కంఠమనేని
స్పేడ్ ఈజ్ స్పేడ్ ఇది ఒక గూమింగ్ గ్యాంగ్ కేసు, కార్పొరేట్ వైఫల్యం, వ్యవస్థకు హెచ్చరిక. నాషిక్ టీసీఎస్ కేసు గురించి ఇప్పటివరకు బయటకు వచ్చినవి ఏమిటంటే.. గూమింగ్, లైంగిక దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, మలేషియా ట్రాఫికింగ్ అనుమానాలు,టెర్రర్ ఫండింగ్ అనుమానాలు, కార్పొరేట్ వ్యవస్థల వైఫల్యం హెచ్ఆర్, మేనేజ్మెంట్ తీరుపై ప్రశ్నలు, మతపరమైన టెన్షన్, మహిళలపై మిసోజినీ, విక్టిమ్ బ్లేమింగ్, అండర్ వర్క్ మహిళా పోలీసుల సాహసం. వీటన్నిటినీ కలిపి చూస్తే.. ఇది ఒక కార్యాలయానికే పరిమితం చేసే కేసు కాదు. ఇది భారత కార్పొరేట్ ప్రపంచానికి, మహిళల భద్రతకు, మతం పేరుతో దుర్వినియోగం చేసే నెట్వర్క్ లకు, మౌనంగా చూసే వ్యవస్థలకు ఒక హెచ్చరిక.
http://www.teluguone.com/news/content/tcs-nashik-case-36-217617.html





