టి. కాంగ్రెస్ లో నాలుగు దిక్కులూ ఒకటైనాయి!

Publish Date:May 1, 2023

Advertisement

అసమ్మతి, తిరుగుబాటు, ఆరోపణలు, నాయకత్వ లోపం ఈ నాలుగూ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే గుణాలు. వీటిని ప్రజాస్వామిక లక్షణాలని కాంగ్రెస్ ఎంత వెనకేసుకుంటూ వచ్చినా, ఈ గుణాలతో కాంగ్రెస్ రాజకీయంగా వెనుకంజ వేస్తూనే ఉంటుంది. ఇది గతం. వర్తమానం బహుశా బవిష్యత్తు కూడా. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో మూడు స్థానాలను గెలిపించి కాంగ్రెస్ కు తెలంగాణ ఓటర్లు కొత్త  ఊపిరి పోశారు.

వీరిలో ఒకరు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు కాగా, మరొకరు ఇప్పటి టీపీసీసీ చీఫ్.  మూడో వ్యక్తి ఎప్పుడూ అసమ్మతి గ్రూపు వైపు నిలబడే నేత. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత భుజాన వేసకున్న సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో కొంత ముందడుగు వేశారు.  రేవంత్, ఉత్తమ్, వెంకటరెడ్డిలను ఒక్క తాటిపైకి తెచ్చి జానా తన పంతం నిలబెట్టుకున్నారు. అయితే ఒకే వేదికపై ఇక్యతనుచాటిన నలుగురూ ఈ ఐక్యతను ఎన్నికల వరకూ కొనసాగిస్తారా అన్నది అనుమానంగేనా ఉంది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, సచివాలయ ప్రారంభోత్సవం వంటి  కార్యక్రమాలతో దూసుకు పోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తోంది. బీఆర్ఎస్ కార్యక్రమాలను తప్పుపడుతున్న బీఆర్ఎస్ కార్యాక్రమాలను తప్పు పడుతున్న ఇతర రాజకీయ పార్టీల నేతలను అర్భకులుగా అభివర్ణించడం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సూచిస్తోంది.

మరో వైపు ప్రశ్న పత్రాల లీకేజీ, రైతు సమస్యలు, తాజాగా నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎన్నికల వేళ  ఐక్యంగా ఉండాలన్న తలంపుతో ఉంది.  ఉద్యమాల చరిత్ర ఉన్నతెలంగాణ గడ్డపై అనేక సంవత్సరాలుగా చెప్పుకోదగిన పరిణామాలు జరగలేదనే చెప్పాలి.  2014 తరువాత ఈ పదేళ్లలో స్తబ్దుగా ఉన్నసామాజిక వాతావరణాన్ని చైతన్యపరిచేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. గాంధీభవన్ లో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వీరు మారరు అని ప్రజలు భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర నేతలు ఒక్క మాటపై నిలబడడంతో కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త ఆశలు చిగురించాయి.  నహైదరాబాద్ ఓఆర్ఆర్ ను 30  సంవత్సరాల లీజు వ్యవహారంలో వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఈ విషయంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి కంప్లెయింట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.  30వ తేదీన  ప్రారంభమైన తెలంగాణ సచివాలయానికి తమ పార్టీ అధ్యక్షుడిని రాకుండా అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏది  ఏమైనా  ఇంత కాలానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం  ఒక్కటికా పోరాడాలని తీసుకున్ననిర్ణయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.