కాటికెళ్లాలన్నా.. కట్టె కాలాలన్నా.. బాదుడే బాదుడు

Publish Date:Jul 24, 2022

Advertisement

అనాదిగా రాజుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, ధ‌నిక‌వ‌ర్గానికి, వ్యాపారుల‌కు సులువుగా చిక్కేది సామాన్య‌ప్ర‌జ‌లే. ప‌చ్చిమిర‌ప‌కాయ నుంచి ప‌చారీ సామాన్ల వ‌ర‌కూ దేని జోలికి స్వేచ్ఛ‌గా వెళ్ల‌నీయ‌రు. ఏదో ర‌కంగా క‌నీసం రెండు రూపాయ‌లు అద‌నంగా కొట్టేద్దామ‌నే అనుకుంటారు. కాలం మారినా, ఆ  దాడి ఆలోచ‌న‌లో మాత్రం పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు, పేరు మార్చారంతే. ఇంకా చెప్పా లంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించు కోవడా నికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి.  ఏదో ఒక సాకుతో అధిక ప‌న్నులు వ‌సూలు చేయ‌డం దేశంలో ఇప్పుడు నిత్య‌కృత్య‌మైంది. మ‌రీ ముఖ్యంగా జీఎస్టీతో ఉద్యోగుల జీవితాల‌ను మ‌రింత సంక్లిష్టం చేశారు. సంపాద‌న‌లో స‌గం ఏదో ఒకర‌కం ప‌న్నుల‌కే పోతోంది. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌లు విసిగెత్తు తున్నారు. ఏది కొనాల‌న్నా, తినాల‌న్నా ప్ర‌భుత్వం దాన్నిగురించి ఏమ‌న్నా అన్న‌దా అని ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌ల్పించారు. కేంద్రం కేవ‌లం వ్యాపార‌సంస్థ‌లు, ఆయా కుటుంబాల‌కు మాత్ర‌మే కొమ్ము కాస్తోంద‌న్న‌ది ప్ర‌తీ విష‌యంలోనూ తెలిసిపోతోంది. ఈ ర‌క‌మైన దోపిడీని దేశంలో సామాన్యులు ఊహించ‌లేదు. చిత్ర‌మేమంటే పెరుగు మీద‌కూడా ఐదు శాతం ప‌న్ను విధించ‌డం. ఇంత‌కంటే దారుణాన్ని ఊహించ‌లేం. 

ప్ర‌జ‌లంతా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవ‌డానికి అస‌లా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక అనారోగ్యం పాలై ఆస్ప‌త్రికి వెళితే పెద్ద చికిత్స‌, ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మైతే వాటిని అడ్డుపెట్టుకుని ఆస్ప త్రులు ముందే వాటి ఖ‌ర్చు చెప్పి ప్రాణం లాగేస్తున్నారు. ఓట్లు వేయించు కుని గ‌ద్దె ఎక్కుతున్నామ‌న్న ఇంగితం కూడా లేకుండా పోతోంది. ఓట్ల స‌మ‌యంలో అనేక ప్ర‌మాణాలు, హామీల వ‌ర్షంలో ముంచెత్తి ఓట‌రు న‌వ్వుమొహం చెరిగే లోగా విజేత‌లై దూర‌మ వుతున్నారు. 

అస‌లు ప‌న్నులు అతిగా ఎందుకు విధిస్తున్నాము, ప్ర‌స్థ‌త‌స్థితిలో క‌ట్టేట్టున్నారా లేదా అన్న‌ది ప్ర‌భువుల వారికి బొత్తిగా గిట్ట‌ని అంశం. దాన్ని గురించి ఆలోచించ‌మ‌నే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్ర‌ధాని, ముఖ్య మంత్రుల‌కు, ఆర్ధిక మంత్రుల‌కు అవేవీ చెవికి ఎక్క‌డం లేదు. ఇలాంటివారిని చూసి  ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి  ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా ! బ‌త‌క‌డానికి ఊపిరి మీద కూడా రేపో మాపో ప‌న్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచ‌న వారికెందుకు ఇవ్వ‌డం.. చ‌చ్చేదీ సామాన్య‌లం మ‌న‌మే! 

ఎక్క‌డ ఎక్కువ వ‌స్తువులు కొని ఆనందిస్తారేమోన‌ని ప్ర‌భుత్వానికి ఈర్ష్య. అవును అందుకే   జీఎస్టీ లేని వస్తువంటూ లేదు.  బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్ద‌మొత్తంలో  ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర‌మేమంటే బ‌త‌క‌డానికి ఉద్యోగం, ప‌న్నులు క‌ట్ట‌డానికి జీతం అన్న‌ట్టుగా బ‌డుగు జీవుల బ‌తుకులు మార్చేశారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారికోస‌మే ప్ర‌జ‌లు బ‌త‌కాల‌న్న‌మాట‌! 

ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !

By
en-us Political News

  
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.