కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వడంతో తరుణ్ ఛుగ్ తడబాటు

Publish Date:Nov 4, 2022

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో వీడియోలు విడుదల చేసి కేసీఆర్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ వీడియోలు విడుదల చేస్తూ కేసీఆర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై కౌంటర్ ఇవ్వడంలో బీజేపీ తడబాటుకు గురౌతోందని విశ్లేషణలు చేస్తున్నారు. కేసీఆర్ మీడియా సమావేశం తరువాత శుక్రవారం ఉదయం వరకూ బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.

చివరాఖరికి బీజేపీ అగ్రనాయకత్వం కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేవించడంతో ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి ఆ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హస్తినలో వేర్వేరు మీడియా సమావేశాల్లో కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో మెయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై గురువారం (నవంబర్ 3) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ కౌంటర్ ఇచ్చారు.

హస్తినలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోపణలపై స్పందించడంలో తడబడ్డారు.  ఫాం హౌజ్ లో జరిగిన వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల కొనగోలు బేరాసారాల వ్యవహారంతో మాకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం వినా.. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆయన తత్తరపాటుకు గురయ్యారు. ప్రశ్నలను దాటవేస్తూ.. కేసీఆర్ పై ఎదురుదాడికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెబుతున్నారన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. మరోసారి ఆయన అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. అంతే కానీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కేసీఆర్ ఆరోపణలకు సంబంధించి స్పష్టంగా కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యారు. విలేకరుల ప్రశ్నలకు బదులివ్వడంలో తత్తరపడ్డారు. సమాధానాలు ఇవ్వడం మాని కేసీఆర్ పై, టీఆర్ఎస్ సర్కార్ పై ఎదురుదాడికి దిగారు.

మునుగోడులో తెరాస తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ణతలు చెప్పారు. విజయం కమలాన్నే వరిస్తుందని చెబుతూనే  అక్కడ టీఆర్ఎస్ ధనబలంతో పాటూ, అధికార దుర్వినియోగానికీ పాల్పడిందని ఆరోపించారు.  ఓటింగ్ మొదలవ్వడానికి ముందు వరకూ కూడా మంత్రులు, నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి మునుగొడులోనే బస చేశారని ఆరోపించారు.   కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ దేశాన్ని బలోపేతం చేస్తుంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు గుప్పించారు.

మోడీ హయంలో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమనీ, కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నామంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసి యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తే.. సవాల్ కు సై అనకుండా కేసీఆర్ పిల్లిలా దాక్కున్నారని విమర్శించిన తరుణ్ ఛుగ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కు తాము డబ్బు ఖర్చు చేశామనడం శుద్ధ అబద్ధమన్నారు. కేసీఆర్ కు దేవుడిపై నమ్మకం లేకపోతే ఈడీ దర్యాప్తునకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.   ఫామ్ హౌజ్ వీడియోలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. వీడియోలపై దమ్ముంటే కేసీఆర్ ప్రమాణం చేయాలని తరుణ్ ఛుగ్   అన్నారు.  

By
en-us Political News

  
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.